నితిన్‌కి ఈమధ్య ఏదీ కలసి రావడం లేదు. తన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. ఆశలన్నీ ‘రాబిన్‌వుడ్’, ‘తమ్ముడు’ సినిమాలపైనే ఉన్నాయి. ‘రాబిన్ వుడ్’ ఎప్పుడో రెడీ. విడుదల తేదీ కూడా ఫిక్స్ చేశారు. డిసెంబరులో రావాల్సిన సినిమా ఇది. వాయిదా పడింది. అక్కడ్నుంచి.. ఈ సినిమా ఊసే లేదు. ఇప్పుడు ఏప్రిల్ లో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించుకొంది. ఏప్రిల్ అంటే.. మార్చి నుంచి ప్రమోషన్లు మొదలెట్టాలి. అసలు ఈ సినిమా అనేది ఒకటుంది అనేది గుర్తు చేయడానికి ఫిబ్రవరిలోనే ఓ పాట విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈనెల 14న ఓ పాట రిలీజ్ చేయాలన్నది ప్లాన్. మార్చి నుంచి ఇక వారానికి ఒక అప్ డేట్ ఇవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే టీజర్ వచ్చేసింది. ట్రైలర్ తో పాటు పాటలు బాకీ. మార్చిలో ప్రమోషన్లు కాస్త గట్టిగా చేస్తే తప్ప ఈ సినిమాపై బజ్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. టీజర్ వచ్చినా పెద్దగా ఇంపాక్ట్ కలిగించలేదు. కనీసం ట్రైలర్ అయినా గట్టిగా వదలాలి. మరోవైపు ‘తమ్ముడు’ పరిస్థితీ ఇలానే ఉంది. ‘రాబిన్ వుడ్’ వచ్చి వెళ్లిపోతే తప్ప, ‘తమ్ముడు’ ప్రమోషన్లు మొదలవ్వవు. కాబట్టి వాళ్లు కూడా ‘రాబిన్ వుడ్’ కోసమే వెయిటింగ్. ఈ రెండు సినిమాలే నితిన్ కెరీర్‌ని ఇప్పుడు డిసైడ్ చేయబోతున్నాయి.