విడదల రజనీపై కేసులు పెట్టాలని హైకోర్టు పల్నాడు పోలీసులను ఆదేశించింది. ఎందుకంటే ఐ టీడీపీ కార్యకర్తను పోలీసులతో కొట్టించి లైవ్ లో చూశారు రజనీ. ఆమె బయటకు కనిపించే టైప్ రాజకీయ నాయకురాలు కాదు. డబ్బులతో రాజకీయాలు చేసి.. డబ్బు సంపాదించుకునేందుకు రాజకీయాలు చేసే నేత అని చిలకలూరిపేట ప్రజలకు ఓ స్పష్టత వచ్చింది. సోషల్ మీడియాలో ప్రశ్నించారని చితక్కొట్టించి…తన నాయకుడు జగన్ తరహాలో లైవ్ లో చూశారు. ఆయన న్యాయపోరాటం చేసి ఆ మాజీ మంత్రిపై కేసు పెట్టించారు. పోలీసులు పట్టించుకోకపోవడంతోనే ఆయన హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది.
విడదల రజనీ అక్రమాలు ఇది ఒక్కటి కాదు. ఆమె ఓ స్టోన్ క్రషర్ యజమాని నుంచి రెండు కోట్లు వసూలు చేశారని విజిలెన్స్ తేల్చింది. కానీ కేసులు పెట్టలేదు. ఆమె తమ భూములు ఆక్రమించారని.. తమ దగ్గర డబ్బులు వసూలు చేశారని సాక్ష్యాలతో సహా పదుల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. కానీ ఆమెపై ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తప్పుడు పనులు చేసి ప్రజలు ఓట్లు వేయరు అని తేల్చుకుని గుంటూరు వెళ్లారు.. అక్కడ ఘోరంగా ఓడిపోవడంతో మళ్లీ చిలుకలూరిపేటకు వచ్చి పడ్డారు. కానీ పాత ఘోరాలన్నీ వెంటాడుతూనే ఉన్నాయి.
మహిళలను అరెస్టు చేయవద్దని చంద్రబాబు చెప్పారని .. ఓ సందర్భంగా వైసీపీ నేత పేర్ని నాని ప్రకటించారు. అందుకే ఆ తర్వాత నుంచి రోజా మళ్లీ తన పాత నోరేసుకుని వస్తున్నారు. మంత్రి అయిన తర్వాత.. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తిరుమల దేవుడని ఆమె మార్కెటింగ్ చేసుకున్న వైనం తీసి ప్రజల ముందు పెడితే చాలు.. ఆమె గురించి ప్రజలే డిసైడ్ చేస్తారు. కానీ కూటమి మంచి ప్రభుత్వం అనిపించుకుంటోంది. కానీ అది చేతకానితనంగా ప్రజల్లోకి వెళ్తోంది. మారుతారో లేదో మరి !