జగన్ రెడ్డి కార్యకర్తలకు మహా అయితే మూడు నెలలు జైల్లో పెడతారు అంతే అని .. కావాలంటే జైలుకు పోండి కానీ నా కోసం చట్టవిరుద్ధమైన పనులు చేయడం మాత్రం ఆపవద్దు అని వేడుకుంటున్నారు. కార్యకర్తల కోసం ఎలా పని చేస్తానో జగన్ 2.0 అంటూ పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు. ఆ స్క్రిప్ట్ ఎవరు రాశారో కానీ ముందు గత ఎనిమిది నెలలుగా ఇబ్బందులు పడుతున్న కార్యకర్తలకు ఏదైనా చిన్న సాయం చేసే ప్రయత్నం చేయాలన్న గొణుగుడు మాత్రం వైసీపీ ఆఫీసులోనే వినిపిస్తోంది.
జగన్ రెడ్డికి మానసిక ఆనందం కల్పించడం కోసం ఇతర పార్టీల నేతలపై దాడులు చేయడం.. తిట్టడం వంటివి చేసి ఎంతో మంది కేసుల పాలవుతున్నారు. చుట్టుపక్కల వారితో సైకో ముద్ర వేయించుకున్నారు. వీరిలో ఎంతో మంది ఇప్పుడు న్యాయపరమైన, ఆర్థికపరమైన సమస్యలతో చిక్కుకుంటున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు కొద్ది మందికి డిజిటల్ కార్పొరేషన్, ఫైబర్ నెట్ల ఖాతాలలో జీతాలిచ్చారు. మరి మిగిలిన వారి సంగతిని మాత్రం ఎవరూ పట్టించుకోలేదు.
న్యాయ సాయం అందడం లేరు. జగన్ రెడ్డి సోషల్ మీడియా టీం చేయించిన ఘోరాలకు.. ఇంటూరి రవికిరణ్, వర్రా రవీంద్రారెడ్డి లాంటి వాళ్లు మాత్రమే కాదు..ఇంకా ఎంతో మంది భవిష్యత్ రిస్క్ లో పడింది. అనేక మంది పరారీలో ఉండి కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నారు. వారెవరికీ న్యాయ సాయచేయకపోగా.. చిన్న పాటి ఆర్థిక సాయం కూడా చేయడం లేదు. ముందు ఇబ్బందులు పడుతున్న కార్యకర్తలకు ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలన్న డిమాండ్ సొంత కార్యకర్తల నుంచే వస్తోంది.