తిరుమల శ్రీవారి పాదాల చెంత నిర్మితమవుతున్న ముంతాజ్ హోటల్ వివాదాస్పదమయిది. ఆ పేరు అన్యమతానికి చెందినది కావడంతో ఆ హోటల్ నిర్మాణంపై విమర్శలు వచ్చాయి. జగన్ రెడ్డి హయాంలో ఆ భూమి కేటాయించారు. అక్కడ క్విడ్ ప్రో కో జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. ఇచ్చిన భూమికి తగ్గట్లుగా పెట్టుబడి పెట్టి .. ఉపాధి కల్పించకుండా ఒప్పందం రద్దు చేయాలన్న ఆలోచనకు వచ్చారు. టీటీడీ కూడా కొండ కింద నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ ను ఆపేసి.. ఆ స్థలాన్ని గతంలో ప్రతిపాదించిన ప్రాజెక్టుకు అప్పగించాలని కోరింది.
అయితే ఆ హోటల్ దేశంలోనే ప్రసిద్ది చెందిన ట్రైడెంట్ గ్రూపునకు చెందినది. వారు పెట్టిన సబ్సిడరీ కంపెనీ పేరు ముంతాజ్ హోటల్స్. ఆ కంపెనీ పేరు మీద నిర్మిస్తున్నందున ఆ పేరుతో బోర్డు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ పేరు తీసేసి.. ట్రైడెంట్ హోటల్స్ అనే పేరుతో హోటల్ నిర్మిస్తున్నారు. ఆ పేరే పెట్టారు. రాయలసీమకు ఆ హోటల్ తొలి సెషన్ స్టార్ హోటల్ అవుతుంది. అత్యంత లగ్జరీ సౌకర్యాలో పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే హోటల్ కావడంతో ప్రభుత్వం.. వారి విజ్ఞుప్తికి సానుకూలంగా స్పందించింది. రూ. 300 కోట్లు పెట్టుబడి పెడతామని.. పూర్తి స్థాయిలో స్థానికులకు ఉద్యోగాలిస్తామని భరోసా ఇచ్చింది.
పెట్టుబడిదారుల నమ్మకాన్ని కోల్పోకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. జగన్ హయాంలో వచ్చిన పెట్టుబడులు అయినా.. తీవ్రమైన తప్పిదం ఉంటే తప్ప.. పెట్టుబడిదారులకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతిలోసెవన్ స్టార్ హోటల్ కు గ్రీన్ సిగ్నల్ పడింది. రెండేళ్లలో హోటల్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.