సొంత ఇల్లు బడ్జెట్ లో ఎంత మిగుల్చుకున్నా అది చాలా పెద్ద మొత్తమే అవుతుంది. భారం చాలా వరకూ తగ్గుతుంది. అందుకే ఇళ్ల కొనుగోలుదారులు చాలావరకూ ధరలు ఏ కోణంలో తగ్గుతాయా అని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. చాలా మంది వడ్డీరేట్లు.. ఇతర ప్రయోజనాలు చూసుకుని సంతృప్తి పడతారు. కానీ మంచి డిస్కౌంట్లతో వచ్చే అవకాశాలు చాలా మందికి తెలియదు.
అసలు బిల్డర్ దగ్గర కొనుగోలు చేస్తే ఏమైనా డిస్కౌంట్ ఇస్తే అది అంతకు ముందు పెంచిందే అవుతుంది కానీ.. తగ్గించేదేమీ ఉండదు. కానీ అదే ప్రాజెక్టులో ల్యాండ్ లార్డ్ షేర్ కింద వచ్చే ఫ్లాట్లు.. లేదా ఇన్వెస్టర్ షేర్ కింద వచ్చే ఫ్లాట్లు కొనుగోలు చేస్తే తక్కువకు వస్తాయి. సాధారణంగా రియల్ ఎస్టేట్ కంపెనీలకు సొంత భూమి ఉండదు. ఇతరుల భూమిని డెవలప్ చేసి అందులో ఎంతో పర్సంటేజీ ఇస్తామని ఒప్పందాలు చేసుకుని నిర్మిస్తారు.
ఓ స్కై స్క్రాపర్ అపార్టుమెంట్ నిర్మిస్తే అందులో ఓ నలభై శాతం ల్యాండ్ లార్డ్ కు ఇచ్చేస్తారు. తర్వాత పెట్టుబడులు పెట్టేవారు ఉంటే ఇన్వెస్టర్ షేర్ కింద ఇస్తారు. ఇవి పోను బిల్డర్ అమ్ముకుంటారు. ల్యాండ్ లార్డ్, ఇన్వెస్టర్లు మార్కెట్ చేసుకోరు. అత్యధిక ధర కోసం జిమ్మిక్కులు చేయరు. వీలైనంత త్వరగా తమ పెట్టుబడిని క్యాష్ చేసుకోవాలనకుంటారు. అందుకే డిస్కౌంట్లు ఇస్తారు. ఇప్పుడు చాలా ప్రాజెక్టుల్లో బిల్డర్ షేర్ ఫ్లాట్లు అమ్ముడుపోవడం కష్టంగా మారింది. కానీ ల్యాండ్ లార్డ్ , ఇన్వెస్టర్ షేర్ ఫ్లాట్స్ మాత్రం వేగంగా అమ్ముడవుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ట
ఇది కేవలం హైరైజ్ అపార్టుమెంట్లకే.. కాదు ఇతర ప్రాజెక్టులకూ వర్తిస్తుంది. ఎక్కడైనా ఇల్లు కొనాలనుకున్నప్పుడు అక్కడ ల్యాండ్ లార్డ్ షేర్ ఇళ్లను ముందుగా కనుక్కుని మాట్లాడుకోండి.. కొన్ని పక్షాలు ఆదా అవుతాయి.