జగన్మోహన్ రెడ్డి వీకెండ్ కు లండన్ చేరుకున్నారు. శైలజానాథ్ పార్టీలో చేరుతానని చెప్పడంతో ఆయన కోసం ఉదయం కొంత సేపు కేటాయించారు. ఆ తర్వాత గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బెంగళూరు యలహకంలోని ఇంటికి వెళ్లిపోయారు. వారంలో రెండు లేదా మూడు రోజులు మాత్రమే తాడేపల్లిలో ఉంటున్నారు. ఆ సమయంలో ఓ ప్రెస్ మీట్ పెట్టడం లేకపోతే ఏదో ఓ ప్రాంతం నుంచి కార్యకర్తల్ని పిలిపించుకుని .. రోజూ చేసే ప్రసగం చేయడం కామన్ అయిపోతోంది. ఇప్పుడు కూడా అంతే.
విచిత్రంగా జనాల్లోకి వస్తానని.. కార్యకర్తలతో జగనన్నా కార్యక్రమాన్ని సంక్రాంతి తర్వాత ప్రారంభిస్తానని చెప్పిన ఆయన ఇప్పుడు మాట్లాడటం లేదు. ఆయన పార్టీ నేతలు కూడా మాట్లాడటం లేదు. దీంతో జగన్ తీరుపై క్యాడర్ లో విస్మయం వ్యక్తమవుతోంది. జగన్ కార్యకర్తల్ని కలిస్తే అందరూ తాము ఆర్థికంగా నష్టపోయిన అంశాన్ని.. తమకు రావాల్సిన బిల్లుల అంశాన్ని ప్రస్తావిస్తారని దాని వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయన్న సమాచారం రావడంతో జగన్ కార్యకర్తల వద్దకు వెళ్లే పని విరమించుకున్నట్లుగా చెబుతున్నారు.
కార్యకర్తలు బెట్టింగులు కట్టి ఘోరంగా నష్టపోయారు. జగన్ వల్లనే ఎక్కువ నష్టం జరిగింది. చివరి క్షణం వరకూ తప్పుడు సర్వేలు, పెయిడ్ సర్వేలతో మభ్య పెట్టారు. పులివెందులలో స్థానిక ప్రతినిధుల్ని కలిస్తేనే .. వారందా.. బిల్లులు మహా ప్రభో అని గగ్గోలు పెడుతుతున్నారు. ఇతర నియోజకవర్గాల్లో జగన్ వస్తే ధర్నాలు జరిగే ప్రమాదం ఉంది. అందుకే ఊరుకున్నంత ఉత్తమం అని బెంఘళూరుకే జగన్ పరిమితమయ్యే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.