జగన్ రెడ్డికి తనకు అధికారం లో ఉన్నప్పుడు పోలీసుల్ని ఉపయోగించి రాజకీయ ప్రత్యర్థుల్ని తప్పుడు కేసులతో ఇరికించి కొట్టడం, ఆస్తులు లాగేసుకోవడం తెలుసు. అంతకు మించిన తెలివితేటలు విజయసాయిరెడ్డికి ఉన్నాయి. జగన్ రెడ్డి మళ్లీ కోలుకోలేని విధంగా దెబ్బకొట్టేందుకు ఆయన పరోక్షంగా వేస్తున్న స్కెచ్ల ధాటికి జగన్ విలవిల్లాడటం ఖాయంగా కనిపిస్తోంది. అందులో మొదటి స్కెచ్ షర్మిలతో భేటీలో పూర్తి చేశారు.
విజయసాయిరెడ్డి షర్మిలతో భేటీ చాలా రహస్యంగా జరిగింది. సమావేశమైన మూడు రోజుల తర్వాత విషయం వెలుగు చూసింది. ఏం మాట్లాడారన్నది బయటకు రాలేదు. అయితే ప్రధానంగా ఆస్తుల పంచాయతీ ప్రెస్మీట్లో తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారని అనుకున్నారు. అది నిజమేనని షర్మిల మాటలతో తేలిపోయింది. తాను షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు కాదు.. అసలు ప్రెస్మీట్ పెట్టాలనుకోలేదని జగన్ రెడ్డి బెదిరించి మరీ పెట్టించారని విజయసాయిరెడ్డి షర్మిలకు చెప్పుకున్నారు. షర్మిల అదే మాట.. చెప్పి జగన్ ను చెడామడా తిట్టేసింది. షర్మిల ఆవేశం చూస్తే జగన్ రెడ్డిపై ఆమె ముందు ముందు పెద్ద యుద్ధమే చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ఆస్తుల గొడవలు ఉన్నా విజయసాయిరెడ్డి ఇక నుంచి తాను షర్మిలవైపు ఉంటానన్నట్లుగా సంకేతాలు పంపడం చర్చనీయాంశం అయింది.
విజయసాయిరెడ్డి ఈ ఒక్క వ్యవహారంలోనే జగన్ ను కార్నర్ చేసి ఆగిపోయే చాన్స్ లేదు. జగన్ గుట్టుమొత్తం విజయసాయిరెడ్డికి తెలుసు. ఇప్పుడు ఆయనకు క్యారెక్టర్ లేదని జగన్ అంటున్నారు. తన క్యారెక్టర్ ఏమిటో బయట పెట్టాలని విజయసాయిరెడ్డి డిసైడ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. అక్రమాస్తుల కేసులు, వివేకానందరెడ్డి కేసుల్లో ఆయన పరోక్షంగా అయినా నిజాలు బయట పెడితే జగన్ కు గడ్డు పరిస్థితి ఎదురవుతుంది. విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి ఎందుకు బయటకువచ్చారో తెలియదు. కానీ జగన్ తో ఆయనకు వచ్చిన గ్యాప్ చిన్నది కాదని స్పష్టమవుతోంది.
విజయసాయిరెడ్డికి లెక్కలు బాగా వచ్చు. అందుకే ఆడిటర్ అయ్యారు. రాజకీయ లెక్కలు కూడా బాగా వేయగలనని.. షర్మిలను జగన్ పై మరింతగా ఉసిగొల్పడం ద్వారా నిరూపిచారు. అంటే ఆట మొదలయిందన్నట. ఇక విజయసాయిరెడ్డి జగన్ తో ఆడుకోనున్నారన్నమాట.