ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తున్నాయి. తొలి రౌండ్లలో బీజేపీ నలభైకిపైగా స్థానాల్లో ఆధిక్యం చూపిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ 25 స్థానాల వద్ద ఉంది. మొత్తం 70 స్థానాల అసెంబ్లీలో 36 సీట్లు సాధిస్తే మ్యాజిక్ మార్క్ అందుకున్నట్లవుతుంది. ఇదే ట్రెండ్స్ కొనసాగితే ఢిల్లీలో బీజేపీకి పీఠం దక్కినట్లే అనుకోవచ్చు.
ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని సూచించాయి. ఆ పార్టీకి కనీసం నలభై ఐదు స్థానాలు వస్తాయని అంచనా వేశాయి. ఏపీకి చెందిన కేకే సర్వేస్ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని అంచనా వేశారు. ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారమే ఫలితాలు వస్తున్నట్లుగా తాజా ట్రెండ్స్ చూపిస్తున్నాయి.
అయితే హర్యానా ఎన్నికల ట్రెండ్స్ ను చూసిన తర్వాతా చాలా మంది చివరి రౌండ్లు జరిగే వరకూ ఫలితాల్ని ఊహించలేమని అంచనా వేస్తున్నారు. హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి మొదట్లో మూడింట రెండువంతుల మెజార్టీ వచ్చింది. కానీ తర్వాత ఆ మెజార్టీ బీజేపీకి వచ్చింది. అలా ఫలితాలు తారుమారు కాకపోతే ఢిల్లీలో కేజ్రీవాల్ మట్టి కరిచినట్లే అనుకోవచ్చు.