చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. మంత్రులు చేసిన ఫైళ్ల క్లియరెన్స్ లెక్కలతో ఈ ర్యాంకులు ఇచ్చారు. ఫరూక్ మొదటి స్థానంలో ఉన్నారు. వాసంశెట్టి సుభాష్ చివరి స్థానంలోఉన్నారని తేల్చారు. లోకేష్, పవన్ కూడా వెనుకబడ్డారు. చంద్రబాబు కూడా ఆరో స్థానంలోఉ్ననారు. అయితే ఈ ర్యాంకులపై టీడీపీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫైళ్ల క్లియరెన్సే పనితీరుకు ప్రామాణికత ఎలా అవుతుందన్న ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో చంద్రబాబు కూడా స్పందించాల్సి వచ్చింది.
లక్ష్యాలను వేగంగా చేరుకోవాలంటే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడాలని టీమ్ వర్క్‌గా పని చేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలమని నమ్ముతానని చంద్రబాబు ట్వీట్ చేశారు. టీం స్పిరిట్ తో పనితీరుపై సమీక్షించుకుని పనిచేయాలన్న ఆలోచనలో భాగంగానే ఫైళ్ల క్లియరెన్స్ లో మంత్రులకు ర్యాంకులు ఇచ్చామన్నారు. ర్యాంకులు ఎవరినీ ఎక్కువ చేయడానికి కాదు.. ఎవరినీ తక్కువ చేయడానికి కాదు. ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది చెప్పడం ద్వారా తమతో తాము పోటీ పడటంతో పాటు, ఒకరితో ఒకరు పోటీ పడి పనిచేయడానికి, పాలనలో వేగం పెంచేందుకు చేసిన ప్రయత్నమేనని వివరణ ఇచ్చారు.
ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో నేను కూడా నా స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉందని.. గ్రామ స్థాయిలో చిరు ఉద్యోగి నుంచి సీఎం వరకు అంతా కష్టపడి సమిష్టిగా పనిచేస్తేనే ప్రజల సమస్యలు, కష్టాలు తీర్చి… సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టగలమన్నారు. అందుకే ఈ ర్యాంకుల్ని సానుకూల భావనతోనే తీసుకోవాలని కోరారు. ఉద్యోగులకు పోటీ పెట్టినట్లుగా రాజకీయాల్లో మంత్రులకు ఇలా పోటీలు పెడితే వర్కవుట్ అవదని.. బూమరాంగ్ అవుతుందన్న అభిప్రాయం టీడీపీలో వినిపిస్తోంది.