చిరంజీవి ‘విశ్వంభర’ ముగింపు దశలో వుంది. దీని తర్వాత చిరు.. దర్శకుడు అనిల్ రావిపూడితో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ టైం కూడా చెప్పేశారు నిర్మాత సాహు. ఈ సినిమాని మేలో మొదలుపెట్టిన సంక్రాంతి కి రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు.
‘చిరంజీవి గారు, అనిల్ రావిపూడి సినిమా మేలో సెట్స్ పైకి తీసుకువెళ్తాం. సంక్రాంతికి రిలీజ్ చేస్తాం. అనిల్ రావిపూడి మార్క్ లో కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుంది. ఇందులో వింటేజ్ చిరంజీవి కనిపిస్తారు’అని చెప్పుకొచ్చారు సాహు.
విశ్వక్ హీరో గా సాహు గారపాటి నిర్మించిన సినిమా లైలా. రేపు ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి ముఖ్య అతిధిగా వస్తున్నారు. ఇదే వేడుకకి అనిల్ కూడా వస్తున్నారు. అదే వేదికపై వీరి సినిమాపై మరో అప్డేట్ వుండే అవకాశం వుంది.