జనసేన తిరుపతి ఇంచార్జ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. లక్ష్మి అనే మహిళ కిరణ్ రాయల్ తనకు కోటి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలని ఆడియోలు, వీడియోలు బయట పెడుతూ హల్ చల్ చేస్తున్నారు. అయితే ఎప్పుడో ఆమెతో ఆర్థిక వ్యవహారాలు సెటిల్ అయిపోయాయని కిరణ్ రాయల్ అంటున్నారు. అయితే ఆమె తగ్గలేదు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ప్రెస్మీట్ పెట్టి మరిన్ని సంచలన విషయాలు వెల్లడించారు. అయితే ఆమె అలా ప్రెస్మీట్ నుంచి బయటకు రాగానే.. రాజస్థాన్ పోలీసులు వచ్చి పట్టుకున్నారు.
తెలంగాణనో.. తమిళనాడు పోలీసులో అయితే.. దగ్గరే కదా వచ్చారని అనుకోవచ్చు.కానీ రాజస్తాన్ నుంచి వచ్చింది. సాదాసీదా కేసులు అయితే అంత దూరం నుంచి వచ్చే అవకాశం లేదు. అంతే కిరణ్ రాయల్ పై ఆరోపణలు మహిళ బ్యాక్ గ్రౌండ్ కూడా చాలా టిపికిల్ అనే చర్చ కూడా ప్రారంభమయింది. ఆమెపై ఉన్న కేసులు ఏమిటన్నదానిపై ఇంకా రాజస్థాన్ పోలీసులు ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అయితే ఆమె అనేక మంది ని ఆన్ లైన్ మోసాల్లో లక్షలు మోసం చేసిందన్న ఆరోపణలు మాత్రం మీడియాలో వస్తున్నాయి.
అసలు పోలీసులు రాజస్థాన్ నుంచి ఎలా వచ్చారన్నది సందేహంగానే ఉంది. చాలా రోజులుగా అక్కడి కేసుల్లో ఆమె నిందితురాలిగా ఉన్నారని..పరారీలో ఉన్నారని అంటున్నారు. ఆమె ఆచూకీ కోసం వెదుకుతున్నట్లుగా కొందరికి తెలుసని.. ఆమె తిరుపతిలో ఉందన్న సమాచారాన్ని వారికి ఇచ్చారని అంటున్నారు. వారు ఆమెను అరెస్టు చేసేందుకు అవసరమైన సాయం కూడా చేశారని అంటున్నారు.రాజస్థాన్ పోలీసులు లక్ష్మిని అరెస్టు చేయడంతో కిరణ్ రాయల్ సన్నిహితులు.. ఆమె ఎలాంటిదో .. ఆమె ఆరోపణలు ఎలాంటివో తమ వాదన చెప్పుకునే అవకాశం దక్కించుకున్నారు.