అల్లు అరవింద్ మెగాఫ్యాన్స్ కి తనవైపు నుంచి ఓ వివరణ ఇచ్చారు. మొన్న రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సినిమాని ఉద్దేశించి అరవింద్ చేసిన కామెంట్స్ మెగా ఫ్యాన్స్ ని హార్ట్ చేసిన సంగతి తెలిసిందే. దిల్ రాజు సమక్షంలో జరిగిన ఓ వేడుకలో ఓ సినిమా పడిపోయింది (గేమ్ చెంజర్)మరో సినిమా పైకి(సంక్రాంతికి వస్తున్నాం) వెళ్ళిందని అరవింద్ కామెంట్ చేయడం మెగా ఫ్యాన్స్ లో మంటపుట్టించింది.
ఈ రోజు జరిగిన తండెల్ ప్రెస్ మీట్ లో దీనిపై వివరణ ఇచ్చారు. ‘నేను దిల్ రాజు గారిని పరిచయం చేయడానికి అలా అన్నాను కానీ ఉద్దేశపూర్వకంగా కాదు. ఈ విషయంలో ఫీలైన మెగా అభిమానులకు సారీ చెబుతున్నాను. అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. చరణ్ నా కొడుకు లాంటి వాడు. నాకున్న ఏకైక మేనల్లుడు. నేను ఏకైక మేనమామని. చరణ్ కి నాకు వున్న రిలేషన్ అద్భుతం. అది పొరపాటున అన్నమాటే. ఆ మాట వాడకపోవాల్సింది. మీరు అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాను’అని ఎమోషనల్ అయ్యారు అరవింద్. మొత్తానికి ఆయన క్లారిటీతో ఈ వివాదానికి ఇక్కడితో పుల్ స్టాప్ పెట్టారు.