పండగ సీజన్ ఫ్యామిలీ సినిమాలకి ఎంత ప్లస్సో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రుజువుచేసింది. సినిమా కంటెంట్ పరంగా యావరేజ్ అయినప్పటికీ పాటలు, ప్రమోషన్స్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ సినిమాకి ఓ మ్యాజిక్ లా కలిసొచ్చాయి. ఈ రేంజ్ సక్సెస్ మేము ఊహించలేదని, ఈ విజయం ఓ కేస్ స్టడీ అని దర్శకుడు అనిల్ పదేపదే చెబుతున్నాడు. ఏదేమైనా ఇది డైరెక్టర్ అనిల్ కి మెమరబుల్ సంక్రాంతి.
అనిల్ రావిపూడి నుంచి రాబోయే రెండు సినిమాలు కూడా ఫిక్స్ అయ్యాయి. చిరంజీవితో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాని సాహు గారపాటి, సుస్మిత నిర్మిస్తారు. సమ్మర్ లో సెట్స్ పైకి వెళుతుంది. ఇది కూడా ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్ టైనర్. పండగ సీజన్ లో రావల్సిన సినిమా. అందుకే ఈ సినిమా 2026 సంక్రాంతికి ఫిక్స్ చేస్తున్నారు. నిర్మాత సాహు రిలీజ్ టైం ని ఇప్పటికే రివిల్ చేశారు.
మరోవైపు ‘సంక్రాంతికి వస్తున్నాం’కి సీక్వెల్ కూడా ఫిక్స్ అయ్యింది. స్వయంగా వెంకటేష్ ఈ సీక్వెల్ ని అనౌన్స్ చేశారు. ‘2027 సంక్రాంతికి మళ్ళీ వస్తున్నాం. ఈసారి మరింత వినోదం అందించడమే టార్గెట్’అని చెప్పుకొచ్చారు. అనిల్ రావిపూడి సూపర్ ఫాస్ట్ మేకర్. సంక్రాంతికి వస్తున్నాం సినిమాని 72 రోజుల్లో పూర్తి చేశాడు. చిరంజీవితో చేయబోయే సినిమా వర్కింగ్ డేస్ కూడా అంతే ఉండొచ్చు. ఆ తర్వాత వెంకీ సినిమా పనులు మొదలైపోతాయి. మొత్తానికి మరో రెండేళ్ళు సంక్రాంతి టార్గెట్ గా దూసుకెతున్నారు అనిల్.