రామ్ చరణ్, బుజ్జిబాబు సినిమా షూటింగ్ జోరుగా జరుగుతోంది. స్పోర్ట్స్ డ్రామాగా… గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాకి ‘పెద్ది’ అనే టైటిల్ అనుకుంటున్నారని గతంలో వినిపించింది. ఇప్పుడు మరో వర్కింగ్ టైటిల్ తెరపైకి వచ్చింది. పవర్ క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా వుంటుంది. ద్వితియార్ధంలో కుస్తీ ఆట కీలకం. క్రికెట్-కుస్తీ రెండూ కలిసి వచ్చేలా టైటిల్ పెట్టాలనే ఆలోచన వున్నారు. ‘పవర్ క్రికెట్’ అనే వర్కింగ్ టైటిల్ లో సినిమా షూట్ చేస్తున్నారని సమాచారం.
శివ రాజ్‌కుమార్, జగపతిబాబు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. జాన్వి కపూర్ హీరోయిన్. రెహమాన్ స్వరాలు అందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. తొలి సినిమాతో జాతీయ అవార్డ్ కొట్టిన బుచ్చిబాబు రెండో సినిమాతోనే చరణ్ లాంటి బిగ్ స్టార్ తో అవకాశం అందుకున్నాడు. దాదాపు రెండేళ్ళు ఈ సినిమా స్క్రిప్ట్ పై వర్క్ చేశాడు. విజయ్ సేతుపతి లాంటి నటుడు ఈ సినిమా కథ అద్భుతమని చెప్పడం అంచనాలు మరింతగా పెంచింది.