వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి జగన్ రెడ్డితో కలిసి చేసిన దందాల కారణంగా ఎప్పడు బుక్ అయిపోతానా అన్న భయం దండిగా కనిపిస్తోంంది. ఆయన లిక్కర్ స్కాం అన్న పేరు వినిపిస్తే చాలు ఉలిక్కి పడుతున్నారు. వెంటనే మార్గదర్శి.. మార్గదర్శి అని నినాదాలు చేస్తున్నారు. లోక్ సభలో అదే జరిగింది. జీరో అవర్ లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఏపీలో జరిగిన లిక్కర్ స్కాం గురించి ప్రస్తావించారు. పెద్ద ఎత్తున స్కాం జరిగిందని పూర్తిగా నగదు లావాదేవీలు నిర్వహించి వేల కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు.
ఇందులో ఎక్కడా మిథున్ రెడ్డి ప్రస్తావన రాలేదు. కానీ వెంటనే మిథున్ రెడ్డి జోక్యం చేసుకుని సీఎం రమేష్ బీజేపీ తరపున కాదని.. టీడీపీ తరపున మాట్లాడుతున్నారని ఆరోపించారు. బీజేపీ కూడా లిక్కర్ స్కాంపై అనేక ఆరోపణలు చేసింది. ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి స్వయంగా నగదు లావాదేవీల గురించి బయట పెట్టారు. వేల కోట్లు దారి మళ్లుతున్న వైనాన్ని కూడా ఎన్నికలకు ముందే ఎండగట్టారు. లిక్కర్ స్కాం గురించి బీజేపీ మాట్లాడకూడదన్నట్లుగా మిథున్ రెడ్డి చెప్పుకొచ్చారు. అంతే కాదు.. ఏపీలో అతి పెద్ద స్కాం మార్గదర్శి అని కూడా వాదించే ప్రయత్నం చేశారు.
మిధున్ రెడ్డి లిక్కర్ పేరు వింటే ఎందుకు ఇంతగా ఉలిక్కి పడుతున్నారని టీడీపీ సభ్యులు సెటైర్లు వేస్తున్నారు. ఆయన పేరు ఇప్పటి వరకూ నిందితుడిగా ఎక్కడా అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు. ఒక్క జగన్ మాత్రమే చెప్పారు. లిక్కర్ తో పెద్దిరెడ్డికి, ఆయన కుమారుడికి సంబంధం ఏమిటని చెప్పుకొచ్చారు. ఎంత అమాయకంగా నటించినా.. సంబంధాలు బయట పడకుండా ఉంటాయా అని పత్రికల్లో మాత్రం.. అసలు మనీ లాండరింగ్ చేసి.. డబ్బును చేర్చాల్సిన చోటుకు చేర్చింది మిథున్ రెడ్డేనని చెబుతున్నారు. అందుకే ఆయన ఉలిక్కి పడుతున్నారు.