చాలా కాలంగా ఊరిస్తున్న విజయ్ దేవరకొండ కొత్త సినిమా టీజర్ వచ్చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ చిత్రానికి ‘కింగ్డమ్’ అనే పేరు ఫైనల్ చేశారు. ఎన్టీఆర్ వాయిస్ మొదలైన టీజర్ ఓ ఓపిక్ డ్రామాని తలపించింది.
అలసట లేని భీకర యుద్ధం. అలలుగా పారే ఏరుల రక్తం.వలసపోయిన అలసిపోయిన ఆగిపోనిది ఈ మహారణం.నేలపైన దండయాత్రలు. మట్టికింద మృతదేహాలు.
ఈ అలజడి ఎవరి కోసం?
ఎంత భీవత్సం ఎవరి కోసం ?
ఈ వినాశనం ఎవరి కోసం ?
రణభూమిని చీల్చుకుని పుట్టే కొత్తరాజు కోసం.
కాలచక్రాన్ని బద్దలుకొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం” అంటూ ఎన్టీఆర్ ఇంటెన్స్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ మాటలు, ఆ మాటలకు సరితూగే విజువల్స్ తో టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది.
టీజర్ మొత్తం ఓ వార్ సీక్వెన్స్ లా వుంది. ముఖ్యంగా ఆర్మీ, జైలు నేపధ్యం చాలా కొత్త అనుభూతిని తెచ్చింది. విజయ్ లుక్ నెవర్ బిఫోర్ అన్నట్టుగా వుంది. అనిరుద్ మరోసారి తన బీజీఎం పవర్ చూపించాడు. ‘ఏమైనా చేస్తా సర్.. అవసరమైతే మొత్తం తగలబెట్టెస్తా’ అని విజయ్ చెప్పిన డైలాగ్ టీజర్ లో కొసమెరుపు. మే 30న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.