వైసీపీ సోషల్ మీడియా వ్యవహారం చూస్తూంటే ఇతర పార్టీల వాళ్లు పాపం అనుకుంటున్నారు. ఫృధ్వీని కెలుక్కుని భూతులు తిట్టించుకోవడం ..విశ్వక్సేన్ సినిమాకు బాయ్ కాట్ పిలుపుతో లేనిపోని హైప్ పెంచడంతో పాటు బుల్లి రాజు అనే చైల్డ్ అర్టిస్టుపై పగ తీర్చుకుంటామన్నట్లుగా పోస్టులు పెట్టడం చూసి నవ్వుకుంటున్నారు. అసలు ఓ స్థాయి మెయిన్ టేయిన్ చేయవద్దా అన్న సందేహం ఆ పార్టీలోని వారికే వస్తుంది.
విశ్వక్ సేన్ లైలా సినిమా పంక్షన్ లో ఫృధ్వీ ఏదో అన్నాడని బాయ్ కాట్ లైలా అనే క్యాంపెయిన్ నిర్వహించారు. సాధారణంగా సినిమాలకు ఇలాంటి నెగెటివ్ పబ్లిసిటీ ప్లస్ అవుతుంది.అందుకే కొంత మంది కావాలని వివాదాలు తెచ్చుకుంటారు. ఇప్పుడు లైలా సినిమాకు విశ్వక్ సినిమాల్లోనే హయ్యస్ట్ ఓపెనింగ్ వస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి వైసీపీ కార్యకర్తల శ్రమే కారణం. సినిమా బాగుంటే..ఏ బాయ్ కాట్ పిలుపులూ ఆగవు.. అసలు వైసీపీ కార్యకర్తలు పిలుపునిస్తే ఆగేది ఎవరు ?. . జగన్ తీయించుకున్న సినిమాలుక ఓపెనింగ్స్ కూడా రావంటే.. వారి పిలుపులకు ఏ స్థాయి ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.
ఇక ఫృధ్వీని టార్గెట్ చేసుకున్నారు. పదకొండు మేకలు అంటే..గొర్రెలు అన్నారని అది తమనే అన్నారని.. పూసేసుకుని పోటెత్తిపోయారు. ఫృధ్వీ ఫోన్ నెంబర్ ను ట్విట్టర్ లో పెట్టి హరాస్ చేయడం ప్రారంభించారు.ఆయన బార్య కు ఫోన్ చేయడం ప్రారంభించారు.దీంతో ఫృధ్వీ పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాదు భయంకరమైన బూతులు తిడుతున్నాడు.అసలు ఫృధ్వీ జగన్ కు వీరాభిమాని. ఆయనను దూరం చేసుకుని ఇప్పుడు ఆయనతోనే తిట్టించుకుంటున్నారు.
కొంత మంది సంక్రాంతికి వస్తున్నాం చైల్డ్ ఆర్టిస్టు బుల్లిరాజునూ వదిలి పెట్టడం లేదు. గత ఎన్నికల్లో జనసేనకు ప్రచారం చేశారని. ఆయనను టార్గెట్ చేశారు. వైసీపీ వీరిని టార్గెట్ చేయడానికి బాయ్ కాట్ లైలా అనే హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేయడానికి..డబ్బులు ఖర్చు పెట్టి బాట్స్ కూడా వాడుతున్నారు. విశ్వక్ సారీ చెప్పారు కానీ..ఆయన తీరు వైసీపీని మరింత రెచ్చగొట్టేలా ఉంది.