మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లోని మైహోంభూజాలో ఆయన ఎవరికీ తెలియకుండా ఉంటున్నారు. ఆయన ఆచూకీ తెలుసుకున్న పోలీసులు తెల్లవారుజామునే అరెస్టు చేసి విజయవాడకు తరలిస్తున్నారు.
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడికేసులో ఇటీవల సత్యవర్థన్ అనే ఫిర్యాదు దారు అడ్డం తిరిగారు. ఆయనను వంశీ బెదిరించి వీడియోను రికార్డు చేయించి.. కోర్టులో సబ్మిట్ చేయించినట్లుగా పోలీసులు గుర్తించారు. కోర్టుకు కూడా సత్యవర్థన్ ను వంశీ అనుచరులే తీసుకెళ్లారు. ఈ వ్యవహారం మొత్తంపై నిఘా పెట్టిన పోలీసులు వంశీ స్కెచ్ వేసినట్లుగా గుర్తించి కేసు నమోదు చేశారు.
సత్యవర్థన్ తనను వంశీ అనుచరులు కిడ్నాప్ చేసి బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వంశీ సింపుల్ గా పోయే దానిని ఇలా ఫిర్యాదుదారును బెదిరించి మరింత క్లిష్టం చేసుకున్నారు. పోలీసుల్ని మరింత రెచ్చగొట్టినట్లుగా చేసుకున్నారు.