వల్లభనేని వంశీ మైహోంభూజాలో ఉంటున్నారని గన్నవరంలో ఆయనకు అత్యంత సన్నిహిత నేతలకు కూడా తెలియదు. ఫోన్లకు కూడా చాలా పరిమితంగా అందుబాటులో ఉంటూ వస్తున్నారు. ఎవరినైనా కలవాలంటే ఎవరిదైనా వైసీపీ నేత ఫామ్ హౌస్ .. లేదా హోటళ్లలో కలుస్తున్నారు. అయినా పోలీసులు ఆచూకీ కనిపెట్టి.. కిడ్నాప్ కేసులో అరెస్టు చేశారు.
పోలీసులు తన ఇంటి వరకూ వస్తారని అనుకోలేకపోయిన వంశీ … అప్పుడు కూడా గేమ్ ఆడారు. పోలీసులు చాలా పద్దతిగా అరెస్టు చేస్తున్నామని చెప్పి నోటీసులు ఇస్తే.. డ్రెస్ మార్చుకుని వస్తానని చెప్పి రూమ్‌లోకి వెళ్లి అరగంట వరకూ బయటకు రాలేదు. ఆ సమయంలో ఆయన వైసీపీ మీడియాకు.. వైసీపీ నేతలకు ఫోన్లు చేసి.. తనను కాపాడాలని ప్రాథేయపడినట్లుగా తెలుస్తోంది. ఓ అరగంట సేపు బయటకు వెళ్లకపోతే మీడియా వస్తుందని చెప్పడంతో ఆయన అరగంట సేపు రూమ్‌లోనే ఉండిపోయినట్లుగా తెలుస్తోంది.
చట్టపరంగా మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీసులు గట్టిగా హెచ్చరించిన తర్వాతనే ఆయన బయటకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఆయనకు గౌరవంగా అరెస్టు చేసి తీసుకెళ్లాలనుకున్న పోలీసులకు ఆయన అలా షాకిచ్చారు. కాస్తంత కూడా జాలి చూపించకూడదన్న రీతిలో వ్యవహరించారు.