ఫిర్యాదుదారును బెదిరించి వెనక్కి తీసుకునేలా చేసే విషయంలో వంశీ తర్వాత జరిగే పరిణామాలను ఏ మాత్రం అంచనా వేయకుండా… తొందరపాటుతో చేసిన పనిపై వైసీపీ పెద్దలు అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అసలు అలాంటి ఆలోచన ఏ చెట్టు కిందప్లీడర్ కూడా ఇవ్వడని… వంశీకి ఆ ఆలోచన ఎందుకు వచ్చింది.. ఎందుకు ఎగ్జిక్యూట్ చేశారన్నది వైసీపీ పెద్దలకు కూడా అంతుబట్టడం లేదు.
వల్లభనేని వంశీ టీడీపీ హిట్ లిస్టులో ఉంటారు. ఆ విషయం ఆయనకు కూడా బాగా తెలుసు. అలాంటప్పుడు నేరుగా ప్రభుత్వం, పోలీసులపైనే కుట్రలు చేస్తే చూస్తూ ఉరుకుంటారా? ఇంత చిన్న లాజిక్ వంశీ ఎలా మిస్సయ్యాడని వారు విస్మయానికి గురవుతున్నారు. వంశీపై ఉన్న నెగెటివిటీ.. ఆయన మాట్లాడిన బూతులు.. చేసిన చేష్టల కారణంగా.. అరెస్టు విషయంలో కనీస సానుభూతి కూడా రాదు. ఇప్పటి వరకూ అరెస్టు చేయకపోవడం చేతకానితనమన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.
వంశీ అత్యుత్సాహంతో ఓ పెద్ద తప్పు చేశారు. అది ఆయనను ఎంత కాలం వెంటాడుతుందో చెప్పడం కష్టమని లాయర్లు కూడా చెబుతున్నారు. ఈ అరెస్టు తర్వాత కొడాలి నాని కూడా ఎవరికీ అందుబాటులో లేకుండా పోయినట్లుగా ప్రచారం జరుగుతోంది.