పుష్ప సినిమా కథ చాలా గమ్మత్తుగా తయారైయింది. సుకుమార్ దగ్గర ఓ క్యారెక్టర్, రెండు సీన్లు తప్పితే కథ లేదు. ఆ క్యారెక్టర్ కి బన్నీ ఒప్పుకున్న తర్వాత కథ వండటం మొదలైయింది. ఆ వంటకం ఎంత రుచికరంగా వచ్చిందంటే ఫస్ట్ హాఫ్ కే పూర్తి సినిమా నిడివి వచ్చింది. దీంతో ఫస్ట్ హాఫ్ ని పుష్ప- రైజ్ గా రిలీజ్ చేశారు. మొన్న సక్సెస్ మీట్ సుకుమార్ ఇదే విషయాన్ని ప్రస్థావించారు. రెండో సగంగా వచ్చిన పుష్ప రూల్ కూడా ఆదరగొట్టింది.
ఇప్పుడు విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాకి కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. ఫస్ట్ హాఫ్ పార్ట్ 1, సెకండ్ హాఫ్ పార్ట్ 2 గా రాబోతోంది. సింగిల్ సినిమాగా మొదలుపెట్టిన ఈ కథ తెరమీదకి వచ్చేసరికి విస్తృతి పెరిగిపోయింది. కేవలం ఫస్ట్ హాఫ్ లోనే పూర్తి సినిమాకి కావాల్సిన నిడివి వచ్చేసింది. దీంతో ఓ క్లిప్ హ్యంగర్ ఇచ్చి సెకండ్ హాఫ్ ని పార్ట్ 2 గా రిలీజ్ చేయాలని నిర్ణయానికి వచ్చారు.
నిర్మాత నాగవంశీ ఈ సినిమా గురించి ఎప్పుడు ప్రస్థావించిన గొప్పగా చెప్పేవారు. కేజీఎఫ్, సలార్ స్థాయిలో వుంటుందని పోలికలు తెచ్చేవారు. తాజాగా విడుదలైన కింగ్డమ్ టీజర్ ఆ అంచనాలని అందుకుంది. విజయ్ లుక్, డైరెక్టర్ గౌతమ్ టేకింగ్ మేకింగ్ అందరి ద్రుష్టిని ఆకర్షించి సినిమాపై మరింత ఉత్సుకతని పెంచాయి.