కొత్త పంథాలో రాజకీయాలు చేయాలనుకొని బయటకొచ్చిన ఎమ్మెల్సీ కవిత.. చిత్రంగా కాపీ రాజకీయాలు షురూ చేశారు. అది కూడా ఏపీ మినిస్టర్ లోకేష్ ఓల్డ్ ఫార్ములాను ఫాలో అయిపోతున్నారు. ఏపీలో జనాదరణ పొంది కూటమికి అధికారం కట్టబెట్టడానికి ఒకానొక కారణమైన రెడ్ బుక్ స్ట్రాటజీని అందుకున్నారు. పింక్ బుక్ అంటూ కవిత కొత్త రాగం అందుకున్నారు.
” బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు పెడుతోంది. మేం కూడా పింక్ బుక్ మెయింటైన్ చేస్తాం. అధికారంలోకి రాగానే అంతకంతా తిరిగి చెల్లిస్తాం” అంటూ వార్నింగ్ ఇస్తున్నారు కవిత. పదేళ్లు దేశం మెచ్చేలా పాలన కొనసాగించామని.. చెప్పుకుంటున్న కవిత..ఇప్పుడు పరాయి రాష్ట్రం పవర్ ఫార్ములాను అందుకోవడం విశేషం.
ఏపీలో నారా లోకేష్ రెడ్ బుక్ ఫార్ములా విజయవంతమైనట్లుగా..తెలంగాణలో పింక్ బుక్ అంటూ కొత్త స్ట్రాటజిక్ స్లోగన్ ను ఎత్తుకున్నారు. లోకేష్ కూటమి అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని కల్గించాకే రెడ్ బుక్ వాయిస్ ఎత్తుకున్నారు.. కానీ కవిత మాత్రం నాలుగేళ్ళ ముందుగానే ఓల్డ్ ఫార్ములాను అందుకుంటున్నారు. దీంతో..కవిత కాపీ పాలిటిక్స్ చిత్ర విచిత్రంగా ఉన్నాయనే వాదనలు బీఆర్ఎస్ లొనే వినిపించడం గమనార్హం