లేటు వయస్సులో ఘాటు ప్రేమతో వార్తల్లో నానుతున్నారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. దివ్వెల మధూరి – దువ్వాడల ప్రేమాయణం తాజాగా సోషల్ మీడియాను ఊపేస్తోంది. కుటుంబ వివాదాల తర్వాత కలిసిసాగుతామని కబుర్లు చెప్పిన ఈ జంట అప్పట్లోనూ మీడియాలో హైలెట్ అయింది. ఇప్పుడు మళ్లీ వాలెంటైన్స్ డే సందర్బంగా మీడియాను దున్నేస్తున్నారు.
దువ్వాడ- దివ్వెల జంటను వాలెంటైన్స్ డే సందర్బంగా ఇంటర్వ్యూకు పిలిచారు. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న జంటలపై దాడుల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ఏదైనా సందేశం ఇప్పించేందుకు ఈ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారేమో అనుకుంటే..ముద్దుల పోటీగా మార్చేశారు.
ప్రపోజ్ డే అంటూ లవ్ ప్రపోజ్ చేసుకున్న అనంతరం..ముద్దులు కూడా పెట్టించారు. ఏమాత్రం మొహమాటం లేకుండా నిరాకరించకుండా ముద్దులు పెట్టుకున్నారు.ఇంకా విడాకుల ప్రక్రియ ముగియకముందే మరో స్త్రీతో బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం, దానిక్ వాలెంటైన్స్ డే తోక తగిలేయడం పట్ల ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాలెంటైన్స్ డేను ముద్దుల డేగా మార్చేసే సందేశం ఇచ్చేలా ఉందని మండిపడుతున్నారు. ఓ ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఇలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.