Lఒకరి మెప్పు కోసం ఎంతకు దిగజారకూడదో..అదే చేసిన వల్లభనేని వంశీ శిక్ష అనుభవిస్తున్నారు. ఎవరి అండ, ఏ పార్టీ జెండా చూసుకొని విర్రవీగారో అక్కడి నుంచే ఆయనకు మద్దతు కరువైంది. ఏమైనా జగన్ చూసుకుంటారు..కొడాలి నాని ఉన్నారులే అని భ్రమలు ఇప్పుడు పటాపంచలు అవుతున్నాయి.
వల్లభనేని వంశీ , కొడాలి నానిల మధ్య సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. కానీ, ఇప్పటివరకు వంశీ అరెస్ట్ పై కొడాలి నాని కిక్కురుమనలేదు. ఏమైనా మాట్లాడితే తనకూ ప్రమాదం పొంచి ఉందన్న అభద్రతా భావంతో కొడాలి నాని ఉన్నారు. పోనీ మరో ఫైర్ బ్రాండ్ పేర్ని నాని నాలుక చప్పరించారా అంటే అది లేదు. జగన్ తనకు ఏమాత్రం సెట్ అవ్వని రాజ్యాంగం గురించి ట్వీట్ చేసి చేతులు దులిపేసుకున్నారు.
కానీ, అత్యంత సన్నిహితుడైన కొడాలి నాని , వంశీ అరెస్ట్ గురించి మాట మాత్రాన కూడా ప్రస్తావించలేదు. ఈ అరెస్ట్ సరైంది అనే అభిప్రాయానికి కూడా వచ్చి ఉన్నారేమో..అందుకే తన మౌనం ద్వారా ఈ విషయాన్ని చెప్తున్నారనే వాదనాలూ వినిపిస్తున్నాయి.