బాలకృష్ణ ప్రేమ, ఇష్టం, అభిమానం, ఆఖరికి కోపం కూడా అన్నీ పీక్స్‌లో ఉంటాయి. ఎవర్నయినా ఒక్కసారి అభిమానిస్తే వదలడు. ముఖ్యంగా తనతో పని చేసిన కొంతమంది టెక్నీషయన్లను ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉంటాడు బాలయ్య. ఇప్పుడు బాలయ్య అలా అభిమానిస్తున్న సంగీత దర్శకుడు తమన్.
ఈమధ్య కాలంలో బాలకృష్ణ సినిమాల్ని తన ఎలివేషన్లతో.. హీట్ ఎక్కిస్తున్న సంగీత దర్శకుడు తమన్. ‘అఖండ’లో తమన్ ఇచ్చిన బీజియమ్స్కి బాక్సులు బద్దలైపోయాయి. ‘డాకూ మహారాజ్’ విషయంలోనూ ఇదే జరిగింది. ఫ్యాన్స్ కూడా తమన్‌ని ఎప్పుడో ఓన్ చేసుకొన్నారు. ఎస్.ఎస్ తమన్ కాదు.. నందమూరి తమన్ అంటూ స్వయంగా బాలకృష్ణే తమన్ ఇంటి పేరు మార్చేశాడు. అలాంటి తమన్‌కు బాలయ్య ఓ ఖరీదైన కారుని కానుకగా ఇచ్చాడు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. బసవతారకం నిర్వహిస్తున్న ఓ చారిటీ షో తమన్ ఆధ్వర్యంలోనే నడుస్తోంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొనే ఇప్పుడు ఓ కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు బాలయ్య. సినిమాలు హిట్టయితే నిర్మాతలు హీరోకి, హీరోలు దర్శకుడికీ ఇలా… గౌరవం ఇస్తుంటారు. తమ ప్రేమని చాటుకొంటారు. కానీ ఓ సంగీత దర్శకుడికి ఖరీదైన బహుమానాలు ఇవ్వడం ఇదే తొలిసారేమో.