సింగల్ మంగ్లీ తాను వైసీపీ సానుభూతిపరురాల్ని కాదని అన్ని పార్టీలు తనకు సమానమేనని ఓ లేఖ రాశారు. తాను చంద్రబాబు పాట పాడనని చెప్పానని.. చంద్రబాబు అనే మాట తన నోటి వెంట రాదని చెప్పానని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఓ లేఖ విడుదల చేశారు. గత ఎన్నికల్లో తాను వైసీపీకి ప్రచారం చేయలేదని.. పాటలు పాడలేదని స్పష్టం చేశారు. 2109లో మాత్రమే ప్రచారం చేశానన్నారు. రాజకీయాల వల్ల తన కెరీర్ కు చాలా నష్టం జరిగిందని అందుకే దూరంగా ఉన్నానని చెబుతున్నారు. ఆమె చెప్పుకోవాల్సి రావడం ఆమె తప్పు కాదు.. ఖచ్చితంగా జగన్ రెడ్డి తప్పే.
మద్దతిచ్చిన ప్రతి ఒక్కరి జీవితాల్ని రిస్కులో పెట్టిన జగన్
జగన్ రెడ్డి చేసిన రాజకీయాల కారణంగా ఆయనకోసం పని చేసిన వారి పరిస్థితి అత్యంత ఘోరంగా మారుతోంది. దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆయా పార్టీల కోసం అందరు కళాకారులు పని చేస్తారు. ఎవరూ వారిపై పార్టీ ముద్ర వేయరు.కానీ జగన్ రెడ్డి కోసం.. వైసీపీ కోసం పని చేసే వారిపై ఆ పార్టీ నేతలు వారి పార్టీ ముద్ర వేసేస్తారు. అలా పని చేసేవారితో చేయకూడని పనులు..చేయిస్తారు. భవిష్యత్ లో ఇతర పార్టీలకు పని చేయకుండా ఆ పార్టీలను తిట్టిస్తారు. మంగ్లిపైనా అలాంటి ముద్ర వేశారు. అందుకే ఆమెకు ఇప్పుడు మానసిక అశాంతి.
పోసాని,అలీ, ఫృధ్వీ సహా ఎంతో మంది !
ఒక్క మంగ్లీ కాదు.. వైసీపీ కోసం పని చేసిన ఇతర కళాకారులందరితోనూ జగన్ రెడ్డి, వైసీపీ ఇలాంటి గేమే ఆడారు. ఫలితంగా పోసాని లాంటివాళ్లు కూడా కనుమరుగు కావాల్సి వచ్చింది. పోసానితో అందర్నీ బూతులు తిట్టించి ఆయన జీవితాన్నిరిస్కులో పెట్టించారు. అలీని ఆయన ప్రాణ స్నేహితుడికి దూరం చేసింది వైసీపీ రాజకీయమే. ఆయన జీవితంలో చాలా కోల్పోయారు. ఫృధ్వీ పరిస్థితి కూడా అదే. ఆయన కెరీర్ త్యాగం చేసి బూతులు మాట్లాడినా చివరికి ఏదీ లేకుండా చేసే ప్రయత్నం చేశారు. చివరికి ఆయన తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తించారు.
తప్పు జగన్ రెడ్డిని నమ్మిన వాళ్లదే
ఇలా చెప్పుకుంటూ పోతే.. వైసీపీ కోసం పని చేసిన వారు.. ఇతర పార్టీలకు టార్గెట్ కావడానికి కారణం పూర్తిగా.. జగన్ రెడ్డి మానసిక సంతృప్తి కోసం అడ్డగోలుగా చేసే వ్యాఖ్యలే. ఇవన్నీ చేయాలని వైసీపీనే ఒత్తిడి తెస్తుంది. నిండా మునిగాం చలేంటని వారు అప్పటికి సంతృప్తి చెందుతారు. కానీ వారు జీవితాన్ని కోల్పోతారు. మంగ్లీ ఇప్పుడు వైసీపీ వాళ్లకు మాత్రమే ఫేవరేట్. ఇతరులకు కాదు. ఇలాంటి లేఖల వల్ల ఉపయోగంలేదు. జగన్ ను నమ్మినందుకు ఆమెకు పడే శిక్ష ఇదే.