పవన్ కల్యాణ్ ‘హరి హర వీరమల్లు’ ప్రమోషన్స్ లో చిన్న కదలిక వచ్చింది. పవన్ కళ్యాణ్ పాడిన తొలి గీతాన్ని ఇదేవరకే విడుదల చేసిన టీం.. లేటెస్ట్ గా ‘‘కొల్లగొట్టినాదిరో..’’ అంటూ సాగే ఓ ప్రేమ గీతాన్ని ఈనెల 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు. మార్చి 28న విడుదల అని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. అయితే డెడ్ లైన్ ని సినిమా అందుకుంటుదా లేదా అనే చర్చ ఫిల్మ్ సర్కిల్స్ లో నడుస్తోంది.
సినిమా విడుదలకు మరో 40 రోజుల సమయం ఉంది. ఫస్టాఫ్ రీ రికార్డింగ్ తో సహా రెడీ అని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఓ ముఖ్యమైన సీక్వెన్స్ తీయాల్సివుంది. అందుకోసం పవన్ డేట్లు కావాలి. ఇప్పట్లో పవన్ షూటింగ్ కి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈనెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి. అప్పుడు పవన్ ఇంకా బిజీ. మార్చి రెండోవారంలో డేట్లు ఇచ్చినా అనుకొన్న సమయానికి సినిమాని పూర్తి చేస్తారా? అనేది అనుమానం. ఇప్పటికే సినిమా చాలా ఆలస్యమైయింది. పవన్ ని తెరపై చూసి చాలా కాలమైయింది. వీలైనంత త్వరగా సినిమాని రిలీజ్ చేయాలని అటు పవన్ ఫ్యాన్స్ కుడా ఎదరుచూస్తున్నారు.