సొంత ఇల్లు కొనడం ఇప్పుడు చాలా ఈజీ అయిపోయిది. నిలకడైన ఆదాయం ఉన్న వారికి బతిమాలి మరీ లోన్లు ఇస్తున్నాయి లెండింగ్ కంపెనీలు. హోమ్ లోన్స్ కంపెనీలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఈ కారణంగా వాటి మధ్య పోటీ కూడా పెరిగిది. అందుకే ఆదాయాన్ని బట్టి ఇల్లు కొనుగోలుకు సంబంధించి వందకు వంద శాతం లోన్లు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. అయితే ఇప్పుడు లోను తీసుకునేవారి చాయిస్ కీలకం. వారు ఇస్తున్నారు కదా అని ఎంత పడితే అంత లోన్ తీసుకుంటే అది బర్డెన్ అవుతుంది.
హోమ్ లోన్ టర్మ్ ను ఏడాది నుంచి ముఫ్పై ఏళ్ల వరకూ ఆఫర్ చేస్తున్నాయి కంపెనీలు. కొన్ని కంపెనీలు ఏడాదికి కూడా ఇస్తాయి కానీ.. మరికొన్నికంపెనీలు మినిమం పదిహేనేళ్లు పెట్టుకోవాలని సూచిస్తాయి. ముఫ్పై ఏళ్ల వ వరకూ ఎంత కాలం అయినా పెట్టుకోవచ్చు. ఎంత ఎక్కువ కాలం పెట్టుకుంటే అంత తక్కువ ఈఎంఐ అవుతుంది. కానీ మనం కట్టే ఈఎంలో అసలు నామమాత్రంగానే ఉంటుంది. వడ్డీ కిందనే అత్యధికం జమ అవుతుంది. తక్కువ కాలం పెట్టుకుంటే ఈఎంఐ ఎక్కువగా ఉన్నా.. అందులో వడ్డీ తక్కువ అసలు ఎక్కువగా ఉంటుది.దీని వల్ల ప్రిన్సిపల్ రుణ భారం తగ్గుతుంది.
అయితే తక్కువ కాలం పెట్టుకోవాలనుకునేవారు ముందుగా తమ ఆదాయ వనరులను అంచనా వేసుకోవాలి. ఈ ఎంత ఎక్కువ ్యినా కట్టగలము అనుకున్నారు తక్కువ టర్మ్‌ను ఖరారు చేసుకోవచ్చు. ఈఎంఐ ఎంత తగ్గితే అంత మంచిది అనుకునేవారు ముఫ్పై ఏళ్ల వరకూ పెట్టుకోవచ్చు. అయితే అది ముఫ్ప ఏళ్ల లోపు వయసు ఉంటేనే కంపెనీలు యాక్సెప్ట్ చేస్తాయి. ఉద్యోగం చేస్తూ ఉంటే..రిటైర్మెట్ డేట్ తర్వాత ఈఎంఐలు ఉండేలా చూసేందుకు బ్యాంకులు సిద్ధం కావు. అందుకే.. వయసు, ఆదాయాన్ని బట్టి…. హోమ్ లోన్ టర్మ్ ను ఖరారు చేసుకోవాలి.