విక్కీ కౌశల్ కథానాయకుడిగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రూపొందిన హిస్టారికల్ యాక్షన్ డ్రామా‘ఛావా’. రష్మిక కీలక పాత్ర పోషించింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ప్రభావం చూపిస్తోంది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ బయోపిక్ ఇది. నిజానికి ఈ సినిమా పుష్ప 2తో పాటు రిలీజ్ కావాల్సింది. అయితే పుష్ప టీం కోరిక మేరకు రిలీజ్ వాయిదా వేసుకున్నారు. అయితే ఈ వాయిదా ఛావా టీంకి బాగా కలిసోచ్చింది.
బాలీవుడ్ లో ఇప్పుడు చెప్పుకోదగ్గ సినిమాలు బాక్సాఫీసు ముందు లేవు. ఛావాకి పాజిటివ్ టాక్ రోజు రోజుకి పెరుగుతోంది. ఇప్పుడు ఈ సినిమా మరో గొప్ప సందర్భం తోడైయింది. నేడు (ఫిబ్రవరి 19) ఛత్రపతి శివాజీ జయంతి. ఈ వైబ్ సినిమా టికెట్ బుకింగ్స్ పై కనిపించింది. వీక్ ఎండ్ కాకపోయినా కొన్ని ఏరియాల్లో అమాంతంగా ఈ సినిమా బుకింగ్స్ పెరిగినట్లు బుక్ మై షో ట్రెండ్ లో కనిపిస్తోంది. ఇప్పటికే సినిమా చూసి ఆడియన్స్ కొందరు తప్పక చూడాల్సిన సినిమా అని థియేటర్స్ లోనే ఎమోషనల్ అవ్వడంతో ఆ బజ్ కూడా ఛావా కలిసొచ్చింది.