వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేశ పడిపోతున్నారు. ప్రతిపక్ష నేత వస్తే కనీసం భద్రతా ఏర్పాట్లు చేయలేదంటున్నారు. భద్రతా ఏర్పాట్లు చేశారా లేదా అన్న సగంతి తర్వాత ముందు ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఆయనే ఇచ్చుకున్నారు. అత్యంత ఘోరమైన పాలన చేసి ప్రతిపక్షానికి కూడా పనికి రావని జనం పాతాళానికి తొక్కేసినా.. నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందేనని చిన్న పిల్లాడు మారాం చేసినట్లుగా మారాం చేస్తున్నారు. కోర్టుకెళ్లారు. అసెంబ్లీకి రానని గుక్క పెడుతున్నారు. అవన్నీ కాదులే అని.. స్వయంగా తనకు తాను ప్రతిపక్షనేత హోదాను ప్రకటించుకున్నారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉండకగా ఆయన మిర్చియార్డులో రోడ్ షో చేశారు. అధికారులు అనుమతి లేదని చెప్పినా వినలేదు. మైక్ పట్టుకోను అని చెప్పి.. మీడియా మైకుల ముందు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. ప్రతిపక్షనేతను వస్తే భద్రతా ఇవ్వలేదన్నారు. ఆయన పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. అయినా వచ్చారు. అనుమతి లేని పర్యటనకు భద్రత ఇవ్వరు. అయినా పోలీసులు భద్రత ఇచ్చారు. కానీ వస్తుంది రైతుల పరామర్శకని చెప్పి.. బలప్రదర్శన కోసం ఏర్పాట్లు చేసుకున్నారు.కార్యకర్తల్ని.. తరలించారు. చివరికి సొంత నేతల్ని తోసుకునేలా చేశారు.
జగన్ పర్యటన అంతా గందరగోళంగా సాగింది. పరామర్శించిన రైతులు లేరు. పనిలో పనిగా వచ్చిన వారిలో కొంత మంది మిర్చి టిక్కీలు వాహనాల్లో వేసుకుని తీసుకెళ్లిపోయారన్న ఆరోపణలు వచ్చాయి. లేళ్ల అప్పిరెడ్డి అనుచరుడు చైతన్య తెచ్చిన ట్రక్కులో పధ్నాలుగు టిక్కీలు తీసుకెళ్ళారని ఎన్టీవీ ప్రకటించింది. జగన్ నిర్వాకంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.