నాపై హత్యాయత్నం జరిగినట్లుగా యాక్షన్ చేస్తే సానుభూతితో ఓట్లే ఓట్లు అని.. పాత కాలం సినిమాల్లో రాజకీయ నేతలు ప్లాన్లు చేసుకునేవారు. తమకు ప్రజల్లో చాలా ఆదరణ ఉందని నమ్మించేందుకు డ్రామా ఆర్టిస్టుల్ని తీసుకు వచ్చి కథలు పడేవారు. అవన్నీ అప్పట్లోనే కామెడీ అయ్యాయి. ఇప్పుడు జగన్ వాటిని ఇంప్లిమెంట్ చేసి రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారు.దీని వల్ల ఆయనకు ఉన్న కామెడీ ఇమేజ్ మరింతగా బలపడుతోంది. ఆయన హావభావాలు.. మీమ్స్ కు బాగా ఉపయోగపడుతున్నాయి.
పొలిటికల్ డ్రామా కింగ్ జగన్
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాలిటిక్స్ లో డ్రామా కింగ్ గా ఉన్నారు. తాను బయటకు వస్తే తన కోసం పరితపించే వర్గాలున్నాయన్నట్లుగా క౧ంత మందిని ఆర్గనైజ్ చేసుకుని సీన్ లు క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని సంతృప్తి పడుతూంటారు. ఓదార్పు యాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఈ డ్రామాలు ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అయ్యగారికి అధికారం ఇస్తే ఏంచేస్తారో చూసి ప్రజలు పాతాళానికి తొక్కేసిన తర్వాత కూడా అవే డ్రామాలను నమ్ముకుంటూడటం అసలు వైసీపీకి పట్టిన దరిద్రం. అసలు జగన్ కోసం సొంత తల్లి, చెల్లే ఏడవడం లేదు…. ఆయన కోసం ఇతరులు ఎందుకు ఏడుస్తారు ?
అధికారంలో ఉన్నప్పుడు కొత్త దేవుడన్నట్లుగా బిల్డప్
జగన్ రెడ్డి ఐదేళ్లలో తాను ఏదో ఊడబొడిచేశానని ప్రజలకు తనను దైవాంశ సంభూతిడిగా చూస్తున్నారని ప్రచారం చేసుకునేందుకు పెయిడ్ ఆర్టిస్టులతో ఎక్కడికి వెళ్లినా మోకాళ్ల దండాలు పెట్టించుకునేవారు. రోడ్డు అంతా ఖాళీగా ఉండేది.. సెక్యూరిటీ ఎవరినీ రానిచ్చేవారు కాదు. కానీ వారు మాత్రం దర్జాగా లోపలికి వచ్చి … ఆ తర్వాత జగన్ రెడ్డి వాహనంలో వస్తూంటే అటు వైపు తిరిగి మోగాళ్ల దండాలువేసేవారు. అత్యంత ఘోరంగా ఓడిపోయేవరకూ ఈ డ్రామాలు జరిగాయి. చివరికి ఓటింగ్ జరిగిన తర్వాత ప్రజాధనంతో లండన్ విహారయాత్రకు పోయినప్పుడూ అక్కడా ఈ సెట్టింగ్ ఏర్పాటు చేసుకున్నారు.
పార్టీ పేరుతో డ్రామా కంపెనీ నడిపితే ఎలా ?
జగన్ ను అరెస్టు చేసినప్పుడు నాలుగేళ్ల పిల్ల అన్నం మానేసిందని సాక్షిలో లేఖలు ప్రచురించేవారు. కొన్ని కొన్ని పిల్లలతో మాటలు మాట్లాడించేవారు. అసలు వారికి రాజకీయం.. అరెస్టు అంటే తెలుసా?. అరెస్టు అనేది తెలిస్తే.. ఎందుకు లోపలేశారో కూడా తెలుస్తుంది కదా. అయినా జగన్ రెడ్డి ఇలాంటి జిమ్మిక్కులు మానుకోలేదు. అధికారంలో ఉన్న పదేళ్లు కూడా డ్రామాల మీదే ఆధారపడ్డారు. బయటకు వచ్చినప్పుడల్లా ఒక్కొక్కరిని దగ్గరకు పిలిపించుకుని వారి కష్టాలు విన్నట్లుగా.. ఏదో చేసినట్లుగా సెట్టింగ్ ఏర్పాటు చేసుకుని పబ్లిసిటీ చేసుకునేవారు.
ఇది సోషల్ మీడియా యుగం
ప్రస్తుతం నడుస్తున్నది సోషల్ మీడియా యుగం. అతి చేస్తే అరగంటలో చీల్చి చెండాడుతారు. అయినా జగన్ రెడ్డి మాత్రం తన ఊహా ప్రపంచంలో తాను బతికేస్తూ ఉంటారు. జైలు వద్దకు పాపను తీసుకొచ్చింది ఎవరో.. ఆ పాప ఎవరో గంటలో బయటకు వచ్చాయి. డ్రామాకంపెనీలతో కలిసి పనులు పూర్తి చేస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు ఇరవై ఏళ్ల కిందట వర్కవుట్ అయ్యావేమో కానీ ఇప్పుడు పూర్తిగా దిగజారిపోయిన రాజకీయాలు అనుకుంటారు. జగన్ రెడ్డి ఇప్పటికైనా కాస్త డ్రామాల మైండ్ సెట్ వదిలి రియాలిటీలోకి వస్తే బెటర్.