ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరైన పవన్ కల్యాణ్‌తో ప్రధాని మోదీ సరదాగా సంభాషించారు. పవన్ కల్యాణ్ దీక్షా వస్త్రాల్లో ఉండటం.. భారీగా గడ్డం పెంచి ఉండటంతో హిమాలయాలకు వెళ్లే ప్లాన్ లో ఉన్నావా అని సరదాగా ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ కూడా ఇంకా సమయం ఉంది సార్ అని స్పందించారు.ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీడియాకు చెప్పారు. వెన్ను నొప్పి కారణంగానే ఇటీవల కొన్ని సమావేశాలకు హాజరు కాలేకపోయానని తన బాధ్యతల్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్నానని పవన్ తెలిపారు. ఏపీలో ఎన్డీఏ కూటమి సమన్వయంతో పని చేస్తోదంన్నారు.
పవన్ కల్యాణ్ గత నెల రోజుల నుంచి అధికారిక కార్యక్రమాలకు హాజరు కాలేదు. కొద్ది రోజులు వ్యక్తిగత పర్యటనకు వెళ్లినా తర్వాత ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైరల్ ఫీవర్ తో పాటు స్పాండిలైటిస్ సమస్య కూడా ఉండటంతో ఆయన చికిత్స తీసుకున్నారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఆలయాల సందర్శనకు కాస్త రిలీఫ్ అనిపించగానే వెళ్లారు. నాలుగు రోజుల పాటు కేరళ, తమిళనాడు ఆలయాల్లో పూజలు చేశారు. తర్వాత కుంభమేళాలో పుణ్యస్నానం చేశారు. అటు నుంచి ఢిల్లీకి వెళ్లి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు.
ఓ కేబినెట్ సమావేశానికి కూడా రాకపోవడంతో కూటమిలో ఏదో జరుగుతోందని వైసీపీ నేతలు ప్రచారం చేసుకున్నారు. కానీ యూఫోరియా కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకోవడంతో అంతా తేలిపోయింది. పవన్ కల్యాణ్ ఆరోగ్యం కుదటపడిన తర్వాత అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.