బియ్యాన్ని కొట్టేసిన కేసులో చాలా రోజలు కుటుంబాన్ని దాచి పెట్టుకుని పారిపోయి.. ఆజ్ఞాతంలో ఉండి బయటకు వచ్చిన పేర్ని నాని ఇప్పుడు తన పాత ముసుగును బయటకు తీశారు. తన రోమం కూడా ఊడదని కృష్ణా జిల్లా జైలు ముందు నిల్చుని సవాల్ చేస్తున్నారు.
వల్లభనేని వంశీ అరెస్టు అయిన తర్వాత మంత్రి కొల్లు రవీంద్ర ప్రెస్ మీట్ పెట్టారు. కొడాలి నాని, పేర్ని నానిలకు కూడా జైలు తప్పదన్నారు. ఈ మాటల్ని ఉద్దేశించి పేర్ని నాని ఈ డైలాగులు చెప్పారు. గత నవంబర్ నుంచి అరెస్టు చేస్తామంటున్నారని.. తాను మచిలీపట్నంలోనే రోడ్ల మీద తిరుగుతున్నా అరెస్టు చేయలేదన్నారు. అరెస్టు చేస్తే చేసుకోవాలని తన రోమం కూడా ఊడదని హెచ్చరించారు.
కొల్లు రవీంద్రకు సంబంధం లేని హత్య కేసులో.. దొరికిపోయిన నిందితులతో కొల్లు రవీంద్రకు ఫోన్ చేయించి.. ఆ కారణం చూపించి ఆయనపై హత్య కేసు పెట్టి జైల్లో పెట్టారు. ఇప్పుడు నేరుగా బియ్యం దొంగతనం కేసులో దొరికిపోయినా పేర్ని నానిని అరెస్టు చేయలేదు. ఈ ధైర్యంతోనే ఆయన .. రెచ్చిపోతున్నట్లుగా టీడీపీ నేతలు అనుకుంటున్నారు. తనను ఇరికించి మరీ అరెస్టు చేశారని.. కానీ దొరికిపోయిన కేసుల్లో పేర్ని నానిని అరెస్టు చేయించలేకపోవడం కొల్లు రవీంద్రకు ఇబ్బందికరంగా మారింది. ఆయనను అవమానిస్తూ పేర్ని నాని మాట్లాడుతున్నారు.