ఏపీకి కేటాయించినా ఇంకా తెలంగాణనే పట్టుకుని వేలాడుతున్న ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు కేంద్రం లాస్ట్ అండ్ ఫైనల్ గడువు ఇచ్చేసింది.అది అయిపోయింది కూడా. నిన్నటితోనే వారు తెలంగాణలో సర్వీస్ పూర్తి చేసుకుని ఇవాళ ఏపీలో రిపోర్టు చేయాల్సి ఉంది. ఆ ముగ్గురు మాజీ డీజీపీ అంజనీకుమార్ , సీనియర్ ఐపీఎస్లు అభిలాష బిస్త్, అభిషేక్ మహంతిలు.
విభజన తర్వాత కేంద్రం నియమించిన కమిటీలు సివిల్స్ సర్వీస్ అధికారుల్ని విభజించారు. అయితే ఆ విభజనను చాలా మంది వ్యతిరేకించి తమకు ఇష్టమైన స్టేట్లో కొనసాగేందుకు క్యాష్ లో ..కోర్టుల్లో పిటిషన్లు వేశారు. ఇప్పటి వరకూ నెట్టుకొచ్చారు. గత ఏడాది అందరి పిటిషన్లను కొట్టేసిన క్యాట్.. కేటాయించిన స్టేట్లలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు అమ్రపాలి సహా పలువురు తెలంగాణ ఐఏఎస్లు ఏపీలో రిపోర్టు చేశారు. కొంత మంది ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లారు. అయితే కేంద్రం ఐపీఎస్లకు సంబంధించి ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో ముగ్గురు ఐపీఎస్లు తెలంగాణలోనే కొనసాగుతున్నారు. ఇప్పుడు వారు ఏపీకి వెళ్లక తప్పదు.
ఇందులో అంజనీకుమార్…బీఆర్ఎస్ హయాంలో చాలా చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఆయన టీడీపీని ఘోరంగా టార్గెట్ చేశారు. డేటా చోరీ అంటూ వైసీపీ చెప్పిన రాజకీయం చేశారు. చివరికి డీజీపీ పోస్టు సంపాదించారు. అయితే ఫలితాలు వస్తున్న సమయంలోనే వంత్ రెడ్డిని అభినందించడానికి వెళ్ళడంతో ఏసీ బదిలీ వేటు వేసింది. ఇప్పుడు ఆయన ఏపీకి రాబోతున్నారు. అయితే మంచి ప్రభుత్వమైన .. టీడీపీ ప్రభుత్వం..ఆయనకు తగిన గౌరవం ఇస్తుంది. అభిషేక్ మహంతి వివేకా హత్య సమయంలో కడపలోనే పని చేశారు. ఆ తర్వాత తెలంగాణకు వెళ్లారు. ఇప్పుడు ఆయన కూడా ఏపీకి వస్తున్నారు.
ఈ ముగ్గురూ తెలంగాణలోనే కొనసాగేందుకు చేయని ప్రయత్నం లేదు. చివరికి ఏపీకి వచ్చేస్తున్నారు.