చిన్న స్థాయి నుంచి నేచురల్ స్టార్ గా ఎదిగాడు నాని. హీరోగా తాను సూపర్ సక్సెస్. నిర్మాతగానూ అంతే. వాల్ పోస్టర్ బ్యానర్ నుంచి వచ్చిన ఏ సినిమా నానినే కాదు, ప్రేక్షకుల్నీ నిరుత్సాహపరచలేదు. ముఖ్యంగా చిన్న సినిమాల్ని మంచి ప్లానింగ్ తో తీస్తుంటాడు నాని. వాటిని ప్రమోట్ చేసుకొనే విధానం కూడా బాగుంటుంది. వాల్ పోస్టర్ బ్యానర్ నుంచి వస్తున్న మరో సినిమా ‘కోర్ట్’ ఇందుకు మరో ఉదాహరణ.
ప్రియదర్శి కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. మార్చి 14న విడుదల అవుతోంది. ఫస్ట్ కాపీ కూడా రెడీ అయ్యింది. విడుదలకు మరో 3 వారాల సమయం ఉంది. అయినా సరే, ఇప్పటి నుంచే ప్రమోషన్లు మొదలెట్టేశాడు. ఈ సినిమా ఓటీటీ డీల్ ఎప్పుడో క్లోజ్ అయ్యింది. దాదాపు రూ.9 కోట్లు నెట్ ఫిక్స్ సంస్థ ఈ సినిమాని కొనేసింది. ప్రియదర్శి రెమ్యునరేషన్ రూ.2 కోట్లు. మిగిలిన పారితోషికాలు. మేకింగ్ కోసం రూ.4 కోట్లు అవుతుందనుకొన్నా.. రూ.6 కోట్లలో సినిమా పూర్తవుతుంది. మరో రూ.3 కోట్లు లాభం. ఇది కేవలం ఓటీటీ డీల్ మాత్రమే. శాటిలైట్ డీల్ ఇంకా క్లోజ్ అవ్వలేదు. థియేటర్ నుంచి వచ్చిందంతా లాభమే. చిన్న సినిమా, విడుదలకు ముందే లాభాలు, రిలీజై మంచి పేరొస్తే, ఆ క్రెడిట్… మొత్తానికి నాని ప్లానింగ్ సూపర్ గా ఉంది. యంగ్ హీరోలంతా ఇలా ప్లానింగ్ తో సినిమాలు తీసుకొంటే.. కొత్త కథలకు, కొత్తతరానికి ప్రోత్సాహం ఇచ్చినవాళ్లవుతారు. ప్రమోషన్ ప్లానింగ్ కూడా బాగుంది. విడుదలకు ముందే ప్రీమియర్లు గట్టిగా వేయాలనుకొంటున్నాడు. సెలబ్రెటీ షోలు, వాళ్ల రివ్యూలతో పాజిటీవ్ బజ్ వస్తే థియేటర్లకు వెళ్లాలన్న ఉత్సాహం కలుగుతుంది. ప్రియదర్శికి కూడా ‘బలగం’ లాంటి హిట్ చేతిలో ఉంది. కాబట్టి… మంచి టాక్ వస్తే, వసూళ్లు దక్కించుకోవొచ్చు.