ధరలు పడిపోవడంతో ఇబ్బంది పడుతున్న రైతులకు కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద అండగా నిలబడాలని నిర్ణయిచుకుంది. కేంద్ర మంత్రులు .. చంద్రబాబునాయుడు సంప్రదింపులు జరిపి ఈ మేరకు కేంద్రంతో అంగీకరించ చేశారు. మర్చి సాగు వ్యయానికి, అమ్మకపు ధర మధ్య వ్యత్యాసాన్ని భరించడానికి కేంద్రం ముందుకు వచ్చింది. అంతే కాదు ఎగుమతులకు అవసరమైన సానుకూల పరిస్థితుల్ని కల్పించేందుకు అవసరమైన నిర్ణయాలను కూడా తీసుకోనున్నారు. ఈ క్రమంలో మర్చి రైతులకు ఎలాంటి నష్టం లేకుండా చూసేందుకు రాష్ట్రం రంగంలోకి దిగింది.
చంద్రబాబు మిర్చి రైతులు, ట్రేడర్లతో ప్రత్యేకంగా సమావేశమై.. అవసరమై చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్రానికి ఇప్పటికి నాలుగు సార్లు చంద్రబాబు లేఖ రాశారు. ఇలా లేఖలు రాస్తున్నారని త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నారని తెలిసి జగన్ రెడ్డి మిర్చియార్డులో కోడ్ ఉన్నప్పటికీ షో చేశారు. అక్కడకు మిర్చి రైతులెవరూ రాకపోయినప్పటికీ.. జనాలను తరలించి డ్రామా నడిపించాలనుకున్నారు. ఇప్పుడు జగన్ మిర్చియార్డుకు వెళ్లడం వల్లనే చంద్రబాబు లేఖలు రాశారని ప్రచారం చేసుకుంటున్నారు.
నిజానికి జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లూ మిర్చిరైతులు పడిన బాధల గురించి చెప్పాల్సిన పనిలేదు. చివరికి యార్డులో వైసీపీ నేతలు దోపిడీతో రైతులు అక్కడే సగం నష్టపోయేవారు. రైతుల పంటను నిలువు దోపిడీ చేసేవారు. రేట్లు వచ్చినా రాకపోయినా పట్టించుకునేవారు కాదు. రేట్లు తగ్గిపోయాయని రైతులు ఆందోళన చేసినప్పుడు ఓ సారి మార్కెట్ రేటు పదమూడు వేలు ఉంటే ఏడు వేలకు మద్దతు ధరతో జీవోలు ఇచ్చారు. ఓ ఏడాది పంట మొత్తం తెగుళ్లతో పోతే కనీసం పరిహారం కూడా ఇవ్వలేదు. ఇవన్నీ రైతులు మర్చిపోయే అవకాశాలు లేవు.