రాజకీయ నాయకుడికి విశ్వసనీయత ఉండాలి. దాన్ని పక్కన పెడితే తన రాజకీయ ప్రయాణంలోఎవరికీ తలవంచకూడదు..కనీసం బయటకు తల వంచినట్లుగా కనిపించకూడదు. అలా ప్రచారం చేసుకుంటే సరిపోదు..కొన్ని నిర్ణయాలు అయినా గట్టిగా తీసుకోవాలి. కానీ జగన్ రెడ్డి రాజకీయ జీవితం చూస్తే..ఎప్పటికప్పుడు ఎవరికి పడితే వారిని ఎదిరిస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తూ.. కాళ్లు పట్టుకుంటున్న వైనం కనిపిస్తుంది. ఇప్పుడు అసెంబ్లీ నిర్ణయంలోనూ అదే కనిపిస్తోంది.
మొన్న ప్రెస్మీట్లో చెప్పింది ఇవాళ గుర్తు లేదా ?
వాళ్లకు బుద్ది పుట్టింది చేసుకోనీయండి అని అసెంబ్లీకి హాజరవకపోతే జరిగే పరిణామాలపై జర్నలిస్టులు ప్రశ్నించినప్పుడు జగన్ అన్నారు. అయితే గట్టిగా వారం కాక ముందే ఆయన తీరు మారిపోయింది. అసెంబ్లీకి ఒక రోజు హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు. గవర్నర్ ప్రసంగాన్ని వింటారని అంటున్నారు. గవర్నర్ ప్రసంగం అయినా అంతా ప్రభుత్వం రాసిచ్చిందే చదువుతారు. ఆ విషయం జగన్ కు తెలియనిదికాదు. మరి ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు?. అనర్హతా భయంతోనే వెళ్లాలనుకుంటున్నారు
గతంలో బెయిల్ కోసం సోనియాతో రాజీ
గతంలో పదహారు నెలల పాటు జైల్లో ఉన్న ఆయన .. బెయిల్ కోసం సోనియా గాంధీ వద్దకు కుటుంబసభ్యులను పంపారని బయటపడింది. షర్మిల ఈ విషయాన్ని ఓ సారి వెల్లడించారు. సోనియాపై నిందలు వేసి.. సోనియాపై పోరాటం అని చెప్పి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆయన చేసిన నిర్వాకం అది. అక్కడైనా ఆయన లాయల్ గా ఉన్నాడా అంటే అదీ లేదు.
మోదీ చల్లని చూపు కోసం ఇప్పటికీ అదే వెన్ను లేని రాజకీయం
మోదీ ఆగ్రహిస్తే తన పరిస్థితి ఏమవుతుందో.. కనీసం తటస్థంగా ఉన్నా తన సంగతి తేల్చేస్తారన్న భయంతో మోదీ కాళ్లు పట్టుకున్నారు జగన్. ఇప్పటికీ వదలడం లేదు. టీడీపీ, జనసేనతో కలిసి వైసీపీని పాతాళానికి తొక్కేసినా బీజేపీపై ఆయన ఇంకా ప్రేమ ఒలకబోస్తూనే ఉన్నారు. ఇలాంటి వెన్ను లేని రాజకీయాలు చేస్తూ.. తన గురించి సోషల్మీడియాలో విచిత్రంగా ప్రచారం చేసుకోవడమే జగన్ నైజం. ప్రచారం కాదు… ప్రవర్తన లేకపోతే ఎవరేం చేస్తారు?