చంద్రబాబు ప్రభుత్వం తొమ్మిది నెలల్లో లక్ష కోట్లకుపైగా అప్పు చేసిందని గూగుల్ చెప్పిందని చెప్పి ఓ స్క్రీన్ షాట్ పట్టుకుని వైసీపీ సోషల్ మీడియా డ్యూటీ చేసేసింది. ఈ మధ్య చాలా కాలం పాటు పని లేక ఉన్న వారందరికీ.. మళ్లీ ఉపాధి లభిస్తుందని అనుకున్నారేమో కానీ పోలోమని.. సేమ్ టు సేమ్ కంటెంట్ తో ట్రెండ్ చేసి దుమ్ము దులిపేశామని అనుకున్నారు.
అయితే అప్పులు అంటే ముందుగా గుర్తు వచ్చేది జగన్ రెడ్డి నిర్వాకాలే. చంద్రబాబు తాకట్టు పెట్టడానికి ఒక్క ఆస్తిని కూడా మిగిల్చకుండా జగన్ తాకట్టు పెట్టేశారు. వైజాగ్ కలెక్టరేట్ ఆఫీసు నుంచి విజయవాడలోని బెరం పార్క్ వరకూ తాకట్టు పెట్టేశారు. మందు బాబుల్ని పాతికేళ్లకు తాకట్టు పెట్టి బాండ్లు తెచ్చారు. కన్సల్టెంట్లను పెట్టుకుని కమిషన్లు ఇచ్చి మరీ అప్పులు తెచ్చారు. ఆ అప్పులన్నీ ఏమైపోయాయో వారికే తెలియాలి.
ఇప్పుడు చంద్రబాబు ఆర్బీఐ నుంచి మాత్రమే అప్పులు తీసుకుంటున్నారు. అవి ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం వచ్చేవే. కొత్తగా రావు. అయినా వైసీపీ నేతలు అప్పులో అని ప్రచారం చేసేందుకు బయలుదేరారు. నిజానికి వారు చెబుతున్న అప్పులు ఇంకా రాలేదు. అవన్నీ అభివృద్ధి పనుల కోసమే చేస్తున్నారు. టిడ్కో ఇళ్లు, అమరావతి, పోలవరం ఇలాంటి వాటి కోసం చేస్తున్న అప్పుల్ని కూడా అప్పులుగా ప్రచారం చేస్తున్నారు. కానీ వైసీపీ నేతలు అప్పుల గురించి మాట్లాడితే.. అందరికీ వైసీపీ చేసిన అప్పులే గుర్తుకు వస్తాయి.