సందీప్ కిషన్ కి మంచి కమర్షియల్ హిట్ పడాలి. ఇందుకోసం ధమాక లాంటి సూపర్ హిట్ ఇచ్చిన త్రినాథరావు నక్కిన తో చేతుల కలిపి ‘మజాకా’ సినిమా చేశాడు. రీతూ వర్మ హీరోయిన్. ‘మన్మథుడు’ ఫేమ్ అన్షు, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 26న విడుదల కానుంది. ఈనేపథ్యంల ట్రైలర్ వదిలారు.
సందీప్ కిషన్ – రావు రమేశ్ తండ్రీ వెరైటీ తండ్రికొడుకులు. ఆడ దిగ్గు వుండదు. ఇంట్లో బ్యాచిలర్స్ లా కాలం గడిపిస్తుంటారు. ఇంతలో కొడుకు ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. తండ్రి మరో అమ్మాయిని ఇష్టపడతాడు. ఈ రెండు ప్రేమకథల సంఘర్షణ ఏమిటనేది అసలు కథ.
ట్రైలర్ లో త్రినాథరావు మార్క్ ఎంటర్ టైన్మెంట్ కనిపించింది. రావు రమేష్ ప్రేమకథ ఇందులో వెరైటీ. సందీప్ కామెడీ టైమింగ్ బావుంది. సింగిల్ లైనర్స్ బాగా పేలాయి. మ్యూజిక్, కెమరా వర్క్ కమర్షియల్ కొలతల్లో వుంది. అన్నట్టు ట్రైలర్ ని జై బాలయ్య నినాదం ముగించారు. ఓ మందు బాటిల్ ని చేతిలో పెట్టి ఇది బాలయ్య ప్రసాదం అని చెప్పడం నవ్వులు పూయించింది