భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఉండే వేడి ఏమిటో చెప్పాల్సిన పనిలేదు. పైగా రెండు దేశాల మధ్య పరిస్థితి ఉప్పు, నిప్పులా ఉంటే.. ఇంకా ఎంత ఆసక్తి ఉంటుందో టెంపరేచర్ పెట్టి చూపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల దృష్టి దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇండియా, పాక్ మ్యాచ్ పై ఉంది. ఇండియాలో చెప్పాల్సిన పనిలేదు. మీడియా, సోషల్ మీడియా.. సామాన్య క్రికెట్ లవర్స్ అందరూ మ్యాచ్ పైనే చర్చిస్తున్నారు. వ్యూహాలను రచిస్తున్నారు.
చాంపియన్స్ ట్రోఫికి పాకిస్తాన్ ఆతిధ్యం ఇస్తోంది. అయితే ఆ దేశానికి వెళ్లేందుకు భారత్ ఒప్పుకోకపోవడంతో మధ్యేమార్గంగా దుబాయ్ ను ఎంచుకున్నారు. భారత్ మ్యాచ్ లు దుబాయిలో జరుగుతున్నాయి. ఈ మ్యాచ్ కూడా దుబాయిలోనే జరుగుతోంది. పాకిస్తాన్ కు వెళ్లి ఆడేందుకు భారత్ అంగీకరించకపోవడంతో రెండు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య వివాదం తలెత్తింది. అయితే భారత్ తో తటస్థ వేదికల్లో అయినా పడకపోతే చాలా నష్టం జరుగుతుంది కాబట్టి పీసీబీ తగ్గక తప్పలేదు.
సాధారణంగా టీ ట్వంటీ మ్యాచ్ ల కంటే వన్డేలు ఇంకా హైప్ క్రికేట్ చేస్తాయి. వన్డే మ్యాచ్ కావడంతో ఇంకా ఎక్కువ టెన్షన్స్ క్రియేట్ చేస్తోంది. పాత మ్యాచులు… ఇతర ఆటల్లో జరిగిన ఘటనలు గుర్తు చేసుకుని సాధారణ క్రికెట్ ఫ్యాన్స్ కూడా రెడీ అయ్యారు.