ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్తాన్ ను వెలివేసింది భారత టీం. దుబాయ్ లో జరిగిన లీగ్ మ్యాచ్ లో సునాయస విజయం అందుకుంది. చాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్ లో టీమిండియా ఒత్తిడినే కాదు.. పాకిస్తాన్ జట్టును కూడా సునాయసంగా చిత్తు చేసింది. చాంపియన్స్ ట్రోఫీకి ఆతిధ్యం దేశంగా ఉన్న పాకిస్తాన్ ను లీగ్ దశలోనే ఇంటికి పంపేసింది.
అసలు భారత ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత గెలుస్తారా లేదా అన్న డౌట్ ఎవరికీ లేదు. కోహ్లీ సెంచరీ చేస్తాడా లేదా అన్నదే అందరినీ ఉత్కంఠకు గురి చేసింది. చివరికి రెండు బంతులు కొట్టాల్సిన దశలో ఫోర్ కొట్టి కోహ్లీ సెంచరీ పూర్తి చేశాడు. ఆ బౌండరీతోనే పాకిస్తాన్ కూడా ఇంటికెళ్లిపోయిది. కష్ట సాధ్యం కాని 242 పరుగు లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు.. రాకెట్ సార్ట్ ఇద్దామనుకుని రోహిత్ శర్మ హిట్టింగ్ చేసే ప్రయత్నంలో ఔట్ అయ్యాడు. అప్పటికి పదిహేను బంతుల్లోఇరవై పరుగులు చేశాడు. తర్వాత వన్ డౌన్ లో వచ్చిన కోహ్లీని నాన్ స్ట్రేయికింగ్ వైపే ఎక్కువగా ఉండేలా చూసి శుభమన్ గిల్ కాసేపు దడదడలాడించాడు. స్కోర్ వంద పరుగులు ఉన్నప్పుడు గిల్ ఔటయ్యాడు. నలభై ఆరు పరుగులు గిల్ చేశాడు. తర్వాత కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ ను పద్దతిగా పేర్చుకుంటూ పోయారు. పాకిస్తాన్ బౌలర్లను అంటు కట్టినట్లుగా కట్టి.. కొట్టారు. లూజ్ బాల్స్ వేసిప్పుడు సిక్సర్లు, ఫోర్లతో శిక్షించారు. వారి ఫిట్ నెట్ అత్యుత్తమ స్థాయిలో ఉండటంతో పాకిస్తాన్ ఫీల్డర్లు కూడా ఏమీ చేయలేకపోయారు. వీరిద్దరూ అలవోకగా పరుగులు సాధిస్తూ.. విజయానికి చేరువ చేశారు.
కోహ్లీ, అయ్యర్ ల బ్యాటింగ్ ముందు పాకిస్తాన్ బౌలర్లు పూర్తి స్థాయిలో తేలిపోయారు. షాహీన్ అఫ్రిదీ, రౌఫ్ వంటి వారితో చాలా జాగ్రత్త అని మ్యాచ్ కు ముందు ప్రచారం చేశారు కానీ.. భారత ఆటగాళ్ల క్లాస్ ముందు వాళ్లు తేలిపోయారు. యాంత్రికంగా బంతులు వేసుకుంటూ వెళ్లిపోయారు. పాతిక ఓవర్లు కాక ముందే చేతులెత్తేశారు. అయితే గెలుపు ఖరారైన దశలో అయ్యర్ 56 పరుగులు చేసి ఔటయ్యాడు. అప్పటికి భారత్ స్కోర్ 214, హార్దిక పాండ్యా రాగానే గబగబా నాలుగు సిక్సులు కొట్టి మ్యాచ్‌ను ముగించేద్దామని తొందరపడ్డాడు. కానీ వెంటనే ఔటయ్యాడు. అప్పటికే కోహ్లీ సెంచరీకి దగ్గరలో ఉన్నాడు. తర్వాత వచ్చిన ఆక్సర్ పటేల్.. కోహ్లీకి స్ట్రైకింగ్ ఇచ్చేందుకు సింగిల్స్ కు ప్రాధాన్యమిచ్చాడు. అయితే విజయానికి ఐదు పరుగులు చేయాల్సిన దగ్గర కోహ్లీ సెంచరీ పరుగులు అవసరం. ఆ స్థాయిలో అసలు పాకిస్తాన్ గెలుపు కోసం ఎవరూ ఆలోచించలేదు. కోహ్లీ సెంచరీ చేస్తాడా లేదా అన్నదే టెన్షన్ గా మారింది. చివరికి విజయానికి రెండు పరుగులు అవసరమైన దశలో కోహ్లీ .. బంతిని బౌండరిని దాటించి.. దేశానికి విజయం అందించారు. తాను సెంచరీ మైలురాయిని అందుకున్నారు. దాంతో దుబాయ్ స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది.
అంతకు ముందు భారీ స్కోర్ చేసి భారత్ ను ఒత్తిడికి గురి చేసి సింపుల్ గా గెలవాలనుకున్న పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ అజామ్ భారత జట్టును తక్కువ అంచనావేశాడు. అందుకే టాస్ గెలవగానే మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పాకిస్తాన్ పరాజయానికి అక్కడే మొదటి అడుగు పడింది. దుబాయ్ స్టేడియం పిచ్ మొదట్లో బ్యాటింగ్‌కు అంతగా అనుకూలించలేదు. మొదటి పది ఓవర్ల పవర్ ప్లేలో పరుగులు సాధించడానికి పాకిస్తాన్ టాప్ ఆర్డర్ చాలా తంటాలు పడ్డారు. పాకిస్తాన్ ఆశల్ని ఎక్కువగా మోసిన కెప్టెన్ బాబర్ అజామ్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన బాబర్ అజామ్ చాలా సులువుగానే పాండ్యా బౌలింగ్ లో వికెట్ కీపర్ కు దొరికాడు. తర్వాత ఆక్సర్ పటేల్ వేసిన ఓ స్ట్రెయిట్ త్రోతో .. మరో ఓపెన్ ఇమామ్ ఉల్ హక్ పెవిలియన్ దారి పట్టారు. దాంతో షాద్ వకీల్, కెప్టెన్ రిజ్వాన్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యత తీసున్నారు. మెల్లగా అయినా వికెట్లు పడకుండా ఆపారు. రన్స్ చేశారు. ముఖ్యంగా షకీల్ భారీ ఇన్నింగ్స్ పడేలా కనిపించాడు. అయితే మూడో వికెట్ కు వందకుపైగా పరుగులు జోడించిన తర్వాత కెప్టెన్ రిజ్వాన్ ను ఫ్రంట్ పుట్ సిక్సర్ కొట్టాలనుకుని ఆక్సల్ పటేల్ బౌలింగ్ లో ప్రయత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో ఏకాగ్రత దెబ్బతిన్న షకీబ్ కూడా.. భారీ షాట్ కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద అక్సర్ పటేల్‌కు చిక్కాడు. దాంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్ వెన్నుముక విరిగిపోయినట్లయింది. తర్వాత కుష్ దిలీప్ షా ఒక్కడే కాస్త పోరాడి చివరి వికెట్ గా ఔటయ్యాడు. మిగతా అంతాఇలా వచ్చి ఇలా వెనుదిరిగారు. పాకిస్తాన్ ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్ సౌత్ వకీల్ నే. అరవై రెండు పరుగులు చేసి పాకిస్తాన్ పరువు పోకుండా కాపాడాడు. తర్వాత రిజ్వాన్ 46 పరగులు, కుష్ దిల్ షా 38 పరుగులు చేశారు. వీరి పుణ్యమా అని పాకిస్తాన్ భారత్ కు 242 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.
పాకిస్తాన్ ఈ మాత్రం టార్గెట్ అయిన పాకిస్తాన్ ముందు ఉంచలగిందంటే దానికి భారత బౌలర్లు ఇచ్చిన ఎక్స్ ట్రాస్ కూడా ఓ కారణంగా. పాకిస్తాన్ స్కోరులో మొత్తం 17 ఎక్స్ ట్రాలు ఉన్నాయి. అయితే ఇన్ని ఎక్స్ ట్రాలు ఇచ్చారని భారత్ బౌలర్ల ప్రతిభను తక్కువ అంచనావేయాల్సిన పని లేదు. ముఖ్యంగా హార్దిక పాండ్యా, కుల్దీప్ యాదవ్ పాకిస్తాన్ ఇన్నింగ్స్ ఎప్పుడు దెబ్బకొట్టాలో అప్పుడు దెబ్బకొట్టారు. టాప్ ఆర్డర్ ను పాండ్యా.. మిడిల్, లోయర్ ఆర్డర్ ను కుల్దీప్ యాదవ్ పెవిలియన్ కు పంపారు. పాకిస్తాన్ ఆటగాళ్లు నిలదొక్కుకుంటున్నారు అనుకుంటున్న సమయంలో పెవిలియన్ కు పంపారు. క్రెడిట్ వీరిద్దరకి కాస్త ఎక్కువ వచ్చినా మిగతా బౌలర్లను తక్కువ అంచనా వేయలేం. ఒక్క షమీ తప్ప అందరూ వికెట్లు తీశారు.
భారత్ చిరస్మరణీయ విజయాల్లో కోహ్లీకి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ కూడా అలాగే ముగిసిందని అనుకోవచ్చు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న భారత ఫీల్డర్‌గా రికార్డులకు ఎక్కాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో నసీమ్ షా ఇచ్చిన క్యాచ్ ను అందుకోవడంతో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో అతడు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ రికార్డును బ్రేక్ చేశాడు. 334 వన్డేల్లో అజారుద్దీన్ 156 క్యాచ్‌లు అందుకోగా 299 మ్యాచ్‌ల్లో కోహ్లీ 157 క్యాచ్‌లు అందుకున్నాడు. జయవర్థనే 218 క్యాచ్‌లతో మొదటి స్థానంలో.. 160 క్యాచ్‌లతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీపాంటింగ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు.