అసెంబ్లీలో ఒక్క రోజు మాత్రమే హాజరు వేయించుకుని తర్వాత తాడేపల్లిలో కూడా ఉండకుండా పారిపోయేందుకు జగన్ రెడ్డి షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. ఆయన మంగళవారమే పులివెందుల వెళ్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఆయన అసెంబ్లీకి హాజరు కాదన్నమాట. ఓ వైపు అసెంబ్లీ జరుగుతూంటే మరో వైపు ఆయన అసెంబ్లీలో ఓ రోజు ప్రజాదర్భార్ నిర్వహిస్తారట. తర్వాత అక్కడి నుంచి బెంగళూరు వెళ్లిపోతారు.
ఓ వైపు అసెంబ్లీ జరుగుతూండగా.. అక్కడ సమస్యలు ప్రస్తావించకుండా జగన్ పులివెందుల ప్రజలను రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు. అక్కడ ప్రజాదర్బార్ నిర్వహిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజాదర్బార్ ఎప్పుడైనా నిర్వహించవచ్చు. వారి సమస్యలు అసెంబ్లీలో చెప్పుకునే అవకాశం మాత్రం అసెంబ్లీ సమావేశాలప్పుడే వస్తుంది. దాన్ని కాదని.. ఆయన ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. సీఎంగా ఉన్నప్పుడు ఒక్క సారంటే ఒక్కసారి కూడా ప్రజాదర్బార్ నిర్వహించలేదు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం మళ్లీ వచ్చాక చేస్తానని చెప్పడానికి సమస్యలు వింటున్నారు.
జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేసే ఏ ఒక్క పనిలోనూ చిత్తశుద్ది ఉండదు. ఎప్పటికప్పుడు ప్రజల్ని సభ్య పెట్టేందుకు అమలు చేసే వ్యూహాలు తప్ప.. ఇంకే ప్రజాప్రయోజనాలు ఉండవు. అసెంబ్లీ జరుగుతూంటే… రాష్ట్రంలో ఉండకుండాపోయే ప్రతిపక్ష నేత ఎవరైనా ఉంటారా ? ఒక్క జగన్ తప్ప.