అమెరికా ప్రభుత్వ ఉద్యోగులను.. పని చేయకుండా ప్రజాధనం తినేసే వ్యక్తులుగా పరిగణిస్తూ…డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆయన .. పెట్టిన డోజ్ వ్యవస్థ చీఫ్ ఎలాన్ మస్క్ వ్యవహరిస్తున్న తీరు అమెరికాలో సంచలనం రేపుతోంది. ట్రంప్ రాగానే.. ఎనిమిది నెలల జీతం ఆఫర్ చేసి .. రాజీనామాలు చేయాలనుకున్న వాళ్లను చేయవచ్చని ప్రకటించారు. వర్క్ ఫ్రం హోం ఉండదని.. అందరూ ఎలాంటి పని అయినా ఆఫీసులకు రావాల్సిందేనని తేల్చడంతో అలా సాధ్యం కాని వాళ్లు ఆ ఆఫర్ ను వినియోగించుకున్నారు.
వారం రోజుల్లో ఏం చేశారో చెప్పకపోతే ఉద్యోగం పోయినట్లేనట !
ఇపుడు ఎలాన్ మస్క్ మరి కొందర్ని సాగనంపేందుకు కొత్త మోడల్ ను ఎంచుకున్నారు. పని తీరుపై స్వయం నివేదికలు అడుగుతున్నారు. ఉద్యోగులు అందరూ గత వారంలో ఏం చేశారో చెప్పాలని.. చెప్పకపోతే ఉద్యోగం పోయినట్లేనని ఈమెయిల్ పెట్టారు. దీంతో అమెరికా మొత్తం ఇదేం టార్చర్ అన్న చర్చ ప్రారంభమయింది. ఈమెయిల్ చేయకపోతే ఇక ఉద్యోగానికి రాజీనామా చేసినట్లేనని చెప్పడం అంటే…. ఉద్యోగుల్ని ఎంత చులకనగా చూస్తున్నారో అర్థం అవుతుందని అంటున్నారు.
అమెరికా ఉద్యోగ వ్యవస్థనే అవమానిస్తున్న ట్రంప్, మస్క్
అమెరికాలో ఉద్యోగులు ఉత్తినే ఉండరు. నిజానికి అమెరికాలో ఉద్యోగ వ్యవస్థ పకడ్బందీగా ఉంటుంది. కింది స్థాయి వరకూ సమర్థంగా పని చేయించుకోవడానికి.. ప్రజలు ఇబ్బంది రాకుండా సర్వీసులు అందించడానికి సరిపడా మ్యాన్ పవర్ ఉంటారు. అయితే ట్రంప్ ప్రభుత్వ ఖర్చు తగ్గిస్తానంటూ ఉద్యోగుల్ని తీసేయడం ప్రారంభించారు. ఉద్యోగుల్ని పిండుకుని ఆ తర్వాత రోడ్డున పడేయడంలో ఘనాపాటిగా పేరున్న మస్క్… ఈ బాధ్యతలు తీసుకుని దానికి తగ్గట్లుగా వ్యవహరిస్తున్నారు.
ట్రంప్ అసహనం.. మస్క్ చర్యలు
ఇటీవల మస్క్ పనితీరుపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన బాగా పని చేస్తున్నారు కానీ ఇది సరిపోదని ఇంకా బాగా పని చేయాలని ఆయన ట్వీట్ పెట్టారు.దానికి ఎలాన్ మస్క్ ఎస్ బాస్ తరహాలో రిప్లై ఇచ్చి.. ఉద్యోగులకు మెయిల్స్ పెట్టాడు. గత వారం రోజుల్లో ఏం చేశారో చెప్పాలని ఆదేశించారు. మొత్తంగా ట్రంప్, మస్క్ ఇద్దరూ కలిసి ప్రభుత్వాన్ని నడిపించే ఉద్యోగులపై పడటం మాత్రం…. భవిష్యత్ లో ఎన్నో సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంది.