అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి అడుగులు ముందుకు పడటంతో. అమరావతికి అటూ ఇటూ నలభై కిలోమీటర్ల మేర రియల్ భూమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. విజయవాడకు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న మైలవరం మీదుగా ఓఆర్ఆర్ వెళ్తుంది. ఇంత కాలం భూముల విలువ పెరుగుదలలో కాస్త అటు ఇటూగా ఉన్న మైలవరం ప్రాంతం హాట్ కేక్ గా మారనుంది.
అమరావతి కోర్ క్యాపిటల్ వేరు.. మొత్తం సీఆర్డీఏ రాజధాని ప్రాంతం వేరు. ఈ విషయం పక్కనపెడితే హైదరాబాద్ లో ఇప్పుడు ఓఆర్ఆర్ లోపల ఉన్నదంతా గ్రేటర్ హైదరాబాద్ గా ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం రింగ్ రోడ్ నిర్మాణాన్ని పూర్తి చేసే సరికి అమరావతిని ఓ కొలిక్కి తెచ్చి ఈ మొత్తాన్ని ఓ మహానగరంలా కలసిపోయేలా చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. గుంటూరు, విజయవాడ, తెనాలి, మంగళగిరితో పాటు పలు మేజర్ గ్రామ పంచాయతీలు ఈ పరిధిలో ఉంటాయి.
మైలవరం ఇప్పటి వరకూ వ్యవసాయ భూముల లావాదేవీలకు ఎక్కువగా ప్రసిద్ధి. ఇక నుంచి సాధారణ ఇళ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా పెరగనున్నాయి. ఓఆర్ఆర్ కు సంబంధించి భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మైలవరం రియల్ ఎస్టేట్ కు మంచి రోజులు వస్తాయని భావిస్తున్నారు. ఇన్ ఫ్రా పెరిగితే.. పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తే.. అభివృద్ధి ఊహించని విధంగా పెరుగుతుందనడంలో సందేహం ఉండదు.