పవన్ కల్యాణ్ ‘హరి హర వీరమల్లు’ నుంచి రెండో పాట విడుదలైంది. ‘కొల్లగొట్టినాదిరో’ అంటూ సాగే ఈ పాటను కీరవాణి జానపద శైలిలో స్వరపరిచారు. మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్యా బెహరా, యామిని ఘంటశాల ఆలపించారు. చంద్రబోస్ లిరిక్స్ ప్రత్యేకంగా నిలిచాయి.
కొండపల్లి వెండి బొమ్మ
కోలాకళ్ళతో చూసిందమ్మా
తీయాతీయాని తేనెల కొమ్మా
తీయని తెరలే తీసిందమ్మా
వజ్రాల జిలుగులున్నా రత్నాల వెలుగులున్నా
కెంపులా వొంపులున్నా మొహరీల మెరపులున్నా
నా పైడి గుండెల్లో వేడిపుట్టించి
మరిగించి మరిగించి కరిగించి
కొల్లగొట్టినాదిరో కొల్లగొట్టినాదిరో.. అంటూ సాగిన పల్లవి ఆకట్టుకునేలా వుంది.
నిధి అగర్వాల్ పాత్రని ఉద్దేశించి వీరమల్లు పాడుకునే పాట ఇది. ఈ పాటలో పవన్‌తో కలిసి అనసూయ, పూజిత పొన్నాడ డ్యాన్స్ చేయడం ఆకరించింది. మార్చి 28న ఈ సినిమా ప్రేక్షకులు మందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.