విశ్వక్ సేన్ ‘ఫంకీ’ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది. ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ దర్శకుడు. అనుదీప్‌కు మంచి కామెడీ సెన్స్ వుంది. తన పంచ్‌లు కొత్త తరహాలో సాగుతాయి. విశ్వక్‌తో తన కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు నుంచి షూటింగ్ మొదలవ్వాలి. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఈనెల 27 నుంచి షూటింగ్ స్టార్ట్ అవ్వొచ్చు.
ఈ సినిమాలో కథానాయిక పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. అందుకోసం గ్లామర్ తో పాటు పెర్ఫార్మెన్స్ కూడా ఉన్న కథానాయిక కోసం వెదుకుతున్నారు. ముందుగా ఈ పాత్ర కోసం కృతి శెట్టిని అనుకొన్నారు. అషికా రంగనాథ్ పేరు కూడా వినిపించింది. ఆమెకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు దర్శకుడి ఆలోచన మారినట్టు టాక్. కథానాయికగా ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ ఫేమ్ కాయడు లోహర్‌ని ఎంచుకొన్నట్టు తెలుస్తోంది. ‘డ్రాగన్`లో తన పాత్రకు మంచి పేరొచ్చింది. అందం, అభినయం రెండింటితోనూ ఆకట్టుకొంది. తనైతే యూత్ ని కూడా ఆకట్టుకోవచ్చని చిత్రబృందం భావిస్తోంది. ఒకట్రెండు రోజుల్లో కాయడుని ఫిక్స్ చేసి, అఫీషియల్ గా ప్రకటించేద్దాం అనుకొంటున్నారు. సినిమా నేపథ్యంలో సాగే సినిమా ‘ఫంకీ’. ఇందులో విశ్వక్ దర్శకుడిగా కనిపించబోతున్నాడు. నిర్మాత పాత్రలో కథానాయిక మెరుస్తుందట. వారిద్దరి మధ్య సాగే కథే.. ‘ఫంకీ’.