చాలా హిందీ సినిమాల టీజర్లు, ఇతర ట్రెండింగ్ వీడియోలు ఉన్నా.. యూట్యూబ్ లో పూర్తిగా జూనియర్ ఎన్టీఆర్ గాలి వీస్తోంది. ఈద్ సందర్భంగా విడుదల అయిన జనతా గ్యారేజీ టీజర్ యూట్యూబ్ ట్రెండింగ్స్ లో టాప్ లో నిలబడింది. విడుదల అయిన కొన్ని గంటల్లోనే పదిలక్షల వ్యూస్ మార్కును దాటేసిన జనతా గ్యారేజీ టీజర్ ట్రెండింగ్ వీడియోల్లో నంబర్ వన్ ప్లేస్ లో ఉంది.
సాధారణంగా హిందీ సినిమాల టీజర్లు.. యూట్యూబ్ ట్రెండ్స్ ను ప్రభావితం చేస్తాయి. నంబర్ వన్ స్థానంలో నిలుస్తుంటాయి. వాటికి ధీటుగా ఎన్టీఆర్ సినిమాకు ఆదరణ ఉండటం విశేషం. ఇటీవలే సోనాక్షి సిన్హా హిందీ సినిమా ‘అఖీరా’ ఇండియన్ ట్యూబ్ ట్రెండ్స్ లో టాప్ పొజిషన్ లో నిలిచింది. అంతకు ముందు రజనీకాంత్ ‘కబాలీ’ టీజర్ వ్యూస్ లో కొత్త రికార్డులను సృష్టించింది.
ఇప్పుడు మాత్రం పూర్తిగా ‘జనతా గ్యారేజీ’ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటి వరకూ దాదాపు పన్నెండు లక్షల వ్యూస్ ను సంపాదించిన ఈ సినిమా టీజర్ అభిమానులను ఉత్సాహపరుస్తూ వ్యూస్ విషయంలో కొత్త రికార్డుల దిశగా ముందుకు వెళుతోంది. అలాగే ఫేస్ బుక్ ట్రెండింగ్స్ లో కూడా జనతా గ్యారేజీ ముందుంది. ఓవరాల్ గా ఇండియన్ సోషల్ నెట్ వర్కింగ్ ట్రెండ్స్ లో ఎన్టీఆర్ సినిమాల్లో ఎన్నడూ లేనంత మంచి రేంజ్ లో నిలబడింది “జనతా గ్యారేజ్’