ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో లోపాలు వెదకడానికి వైసీపీ తంటాలు పడింది. మాజీ ఆర్థికమంత్రి బుగ్గన ప్రెస్ మీట్ పెట్టి పడికట్టు పదాలు వాడారు కానీ.. ఎక్కడ కేటాయింపులు తగ్గాయో చెప్పలేకపోయారు. సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధిని విమర్శించారని కూడా చెప్పలేకపోయారు. ఎందుంటే.. కేటాయింపులు వైసీపీ హయాం కన్నా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక సంక్షేమ పథకాలకు కేటాయింపుల విషయంలోనూ ఏ మాత్రం లోపం వెదకలేకపోయారు.
ఇంటర్ వరకూ చదవుకునే ప్రతి ఒక్కరికి రూ.పదిహేను వేలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అందుకే అందుకు పన్నెండు వేల కోట్లు కావాలని పదివేల కోట్లే కేటాయించారని చాలా పెద్ద లోపం వెదికినట్లుగా కొంత మంది చెప్పారు. కానీ అమ్మఒడికి అమలు చేసిన రూల్స్ అన్నీ కాకపోయినా ధనవంతులకు లక్షల్లో ఫీజులు కట్టే రవీంద్ర భారతి వంటి స్కూల్ పిల్లలకు అమ్మఒడి ఎందుకు ఇస్తారు ?. వారిని తీసేస్తే..అందరికీ పథకం వర్తిస్తుంది. అన్నదాత సుఖీభవ విషయంలోనూ లోపాలు వెదకలేకపోయారు. ఇతర అన్ని పథకాలకూ కేటాయింపులు చేశారు. అయితే ఉచిత బస్సుకు నిధులేవీ అని కొంత మంది లా పాయింట్ లాగారు. ఉచిత బస్సు పథకానికి కొత్త బస్సులు కొంటున్నారు. కొత్త సిబ్బందిని నియమిస్తున్నారు. ప్రత్యేకంగా పథకానికి కేటాయింపులు చేయకపోయినా పబ్లిక్ ట్రాన్స్ పోర్టు ప్రభుత్వంలోనే భాగంగానే ఉంది కాబట్టి సర్దుబాటు చేస్తారు.
వైసీపీ హయాంలో పథకాలకు అరకొర కేటాయింపులు చేసేవారు. అమ్మఒడి పథకానికి ఎప్పుడూ నాలుగైదు వేల కోట్లు కంటే ఎక్కువ కేటాయించలేదు. ముఫ్పై లక్షల మంది తల్లులకు మాత్రమే పథకం వర్తింప చేశారు. ఎంత మంది పిల్లలు ఉన్నా ఒక్కరికే ఇచ్చేవారు. ఇలా చెప్పుకుంటూ పోతే..వైసీపీ బడ్జెట్ తో పోలిస్తే.. టీడీపీ బడ్జెట్ లో వంకలు పెట్టడానికి ఏమీ లేకుండా పోయాయి. అందుకే నెగెటివిటీ ఎదుకని.. ఇంకా మా ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శిస్తున్నారని ఫీల్ అవుతున్నారు. కానీ చేసిన విధ్వంసాన్ని దాటుకుని .. ఆ తప్పులను సరి చేస్తూ మందుకు తీసుకెళ్తున్న విషయం ప్రజలకు చెప్పాలి కాబట్టి..ఆ విధ్వంసాన్ని గుర్తు చేయక తప్పదని టీడీపీ నేతలంటున్నారు