అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తున్న మాట. ఓ అఫీషియల్ స్టేట్మెంట్ కూడా త్వరలోనే రాబోతోందని ఇన్ సైడ్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. అల్లు అర్జున్ – అట్లీ అనగానే కాంబో పరంగా అంచనాలు భారీగా ఉంటాయి. అట్లీ కూడా ఫామ్ లో ఉన్నాడు. వీరిద్దరూ ఎప్పుడు కలిసినా… మార్కెట్ దృష్టిని తమ వైపు తిప్పుకోవడం ఖాయం.
అయితే.. అట్లీతో ఓ సమస్య వుంది. ఆయన తన పారితోషికాన్ని ఒక్కసారిగా రూ.100 కోట్లకు పెంచేశారు. ఈ పారితోషికం చూసి బడా నిర్మాతలే వెనక్కు తగ్గుతున్నారు. ‘జవాన్’లాంటి సినిమా తరవాత అట్లీ రేంజ్ మారడం సహజమే. అయితే… తన రెమ్యునరేషన్ ఊహించనంత స్థాయిలో పెంచేయడం కొంత ఇబ్బంది కలిగించే అంశమే. బన్నీ అటూ ఇటుగా రూ.150 కోట్లు తీసుకొంటాడు. ఈ ప్రాజెక్ట్ గీతా ఆర్ట్స్‌లో చేసినా, బన్నీకి రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే కదా? అంటే దర్శకుడుకీ, హీరోకీ రూ.250 కోట్లు అయిపోతుంది. బన్నీ మార్కెట్ ఇప్పుడు బాగా పెరిగింది కాబట్టి, ఆమాత్రం ఇవ్వడానికి సైతం నిర్మాతలు రెడీనే. కాకపోతే.. అట్లీకి రూ.100 కోట్లు ఇచ్చే స్థాయి ఉందా? అనేది ప్రశ్నార్థకం. అట్లీకి అంత ఇవ్వలేకే.. తమిళ నిర్మాతలు సైడ్ అయిపోతున్నారు. ఇప్పుడు బన్నీ – అట్లీ ప్రాజెక్ట్ ఎవరు నెత్తిమీద పెట్టుకొన్నా, పారితోషికం దగ్గర పేచీ మొదలవుతుంది. బన్నీ ఎంత అడిగినా ఇవ్వడానికి రెడీగానే ఉంటారు. అట్లీకి రూ.100 కోట్లు ఇవ్వడమే సమస్య. తమిళ నిర్మాతలే అట్లీని నమ్మకపోతే తెలుగులో ఎవరు నమ్ముతారు? అట్లీ ఫామ్‌లో ఉన్నాడు. తను పారితోషికం డిమాండ్ చేయడంలో తప్పు లేదు. కానీ మరీ రూ.100 కోట్లు అనేసరికి నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.