అమరావతి పరిపాలనా నగరం పనులు ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే టెండర్ల ఖరారు దాదాపుగా పూర్తి అయింది. ప్రముఖ కంపెనీలు పనులు చేట్టబోతున్నాయి. సమాంతరంగా పలు రకాల పనులు చేయనున్నారు. డిజైన్లు రూపొందించిన నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధులు కాంట్రాక్ట్ కంపెనీల ప్రతినిధులకు ప్రత్యేకమైన ప్రజెంటేషన్లు కూడా ఇచ్చారు. ఇంజినీరింగ్ మార్వెల్ లా ఉండేలా నిర్మాణాలు ఉండనున్నాయి.
ఐదేళ్ల పాటు అమరావతిలో పనులన్నీ ఆపేయడంతో మళ్లీ పనులు ప్రారంభించడానికి అనే సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పాత కాంట్రాక్టులకు కాలం చెల్లిపోవడంతో.. వారితో సెటిల్ చేసుకుని కొంత టెండర్లు పిలిచారు. ఇప్పుడు వాటిని ఖరారు చేసే సమయంలో ఎన్నికల కోడ్ వంటి సమస్యలు వచ్చాయి. చివరికి పట్టాలెక్కే సమయం వచ్చింది. రెండేళ్లలో అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం పనులను పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.
అమరావతి ఓ సస్టెయినబుల్ ప్రాజెక్టు. నిర్మాణం కోసం పూర్తిగా కేంద్రం ఇచ్చే నిధులు, గ్రాంట్లు, ప్రపంచబ్యాంక్, ఏడీబీ వంటి సంస్థల రుణాలతోనే నిర్మితమవుతుంది. అభివృద్ది జురుగుతున్న సమయంలో సీఆర్డీఏకు ఉండే భూములను అమ్మకం ద్వారా నిధులు సమీకరించుకుని అప్పులు తీర్చుకుంటారు. అమరావతిలో పెట్టే పెట్టుబడికి ఐదారు రెట్ల ఎక్కువ విలువ పెరుగుతుందని భావిస్తున్నారు.